గ్రేటర్ యుద్ధంలో గ్రేటెస్ట్ ఓట్లతో గెలిచేదెవరు, అన్ని పార్టీలు ప్రచారాలలో ఫుల్ ఫోకస్ పెట్టినప్పటికీ ప్రజలు మాత్రం వారికి నచ్చిన నేతలనే  ఎన్నుకుంటారని టాక్ వినిపిస్తోంది... జరుగుతున్న ఎన్నికల సమరంలో ఏ గుర్తు జెండా ఏ ఏ డివిజన్ల లలో ఎగరనుందో అని ఓ అంచనాకు వచ్చేస్తున్నారు కొన్ని మీడియా సంస్థలు. ఇంతకీ ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. గ్రేటర్ మొత్తంలో 150 డివిజన్లు ఉండగా.... ఏ పార్టీ ఎన్ని దక్కించు కోనుందో అన్న అంచనా లెక్క ఓ సారి పరిశీలిద్దాం.
 గ్రేటర్ బరిలో కారు స్పీడు చూస్తుంటే అధిక ఓట్లను పొంది మొదటి స్థానంలో నిలిచేలా ఉందంటున్నారు .

జిహెచ్ఎంసి ఎన్నికల్లో 90 పైగా డివిజన్లు  అధికార పార్టీ టిఆర్ఎస్ విజయకేతనం ఎగర వేయనుందని అంచనా వేస్తున్నారు. ఇకపోతే తదుపరి పార్టీ  ఎంఐఎంకు దాదాపుగా  ఓ 30 డివిజన్లలో గెలుపు  తధ్యమని భావిస్తున్నారు. ఆమాత్రం అండ ఈ పార్టీకి ప్రజలలో ఉందని అంటున్నారు. ఇకపోతే ఢిల్లీ నుంచి గల్లీ వరకు రచ్చ రచ్చ చేసిన బిజెపి పార్టీ విషయానికి వస్తే కాస్త అటూ ఇటుగా ఇరవై డివిజన్ల వరకు తన అకౌంట్ లో వేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మిగిలిన డివిజన్లు టీడీపీ కాంగ్రెస్ తదితర పార్టీలు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదంతా విశ్లేషకుల అంచనా మాత్రమే.... నిజానికి ప్రజల ఆలోచనలను అంచనా వేయడం కష్టమే సుమీ. ఎలక్షన్ సమయానికి వారు నమ్మిన నాయకుడికి ఓటు వేసి సంచలనాలు సృష్టించే అంచనాలను తారుమారు చేసే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉండగా ఎంఐఎం నాయకుడు అభివృద్ధి చేసిన వ్యాఖ్యలు బిజెపి ప్రచారంలో బాగా వాడు కుందని తద్వారా ఇది ఎంఐఎం కు రాబోయే సీట్లలో భారీగాాా ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. ఏదేమైనా  అక్బరుద్దీన్ అలా మాట్లాడకుండా ఉండాల్సింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: