గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు ఈ రోజు ఉదయం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు చాలా సీరియస్ గా తీసుకోవడంతో హోరాహోరీ పోరు జరుగుతోంది. ఎలా అయినా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న కో ఆప్షన్ సభ్యుల సంఖ్య ప్రకారం మేయర్ పీఠం టీఆర్ఎస్ దే అయినా సరే మిగతా పార్టీలు పట్టు నిలుపుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికలకు కొంత మంది టాలీవుడ్ హీరోలు దూరంగా ఉండనున్నారు. ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ నిమిత్తం పూణేలో ఉన్నారు.

అలాగే అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమా షూటింగ్ కోసం మారేడుమిల్లి లో ఉన్నారు. దగ్గుబాటి వెంకటేష్ కూడా హైదరాబాద్ లో లేరని అంటున్నారు. ఈ క్రమంలోవీరు ఓటింగ్ కు దూరంగా ఉండనున్నారు. ఇక వోటు హక్కు వినియోగించుకునే సెలబ్రిటీల విషయనికి వస్తే జూబ్లీహిల్స్ క్లబ్ లో చిరంజీవి & ఫ్యామిలీ, కృష్ణంరాజు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జూబ్లీహిల్స్ తెలంగాణ విమెన్ కోపరేట్ సొసైటీ లో అక్కినేని నాగార్జున - అమల, సమంత - నాగ చైతన్య, అఖిల్ లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అల్లు అర్జున్ ఇంటి ముందు ఉన్న ఉలవచారు రెస్టారెంట్ కి వెళ్లే రూట్ లో ఉన్న పోలింగ్ స్టేషన్ లో అల్లు స్నేహ, అల్లు శిరీష్ లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

 ఇక జూబ్లీహిల్స్ భారతీయ విద్యా భవన్ లో మహేష్ బాబు, నమ్రత, నరేష్, కృష్ణలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఓబులరెడ్డి స్కూల్ లో జూ . ఎన్టీఆర్ కుటుంబం ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక బంజారాహిల్స్ యూరో కిడ్స్ స్కూల్ లో విజయశాంతి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక బంజారాహిల్స్ మౌంటెన్ బేకరీ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఫిలింనగర్ సినీ క్లబ్ లో కళ్యాణ్ రామ్, సురేష్ బాబు, రానా, రాఘవేంద్రరావు, లక్ష్మి మంచు, ఉమ మాంటిస్సోరి స్కూల్ పద్మారావు నగర్ లో శేఖర్ కమ్ముల  ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  షేక్ పెట్ ఇంటర్నేషనల్ స్కూల్ లో రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీలు  ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక నటుడు రాజేంద్రప్రసాద్ కూకట్ పల్లి ఇందు ప్రాజెక్ట్స్ ఎదురుగా ఉన్న ఫుట్బాల్ గ్రౌండ్ నందు ఉదయం 10 గంటలకు ఓటు వేస్తారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: