గతంలో పోలింగ్ సందడి మొదలైపోయింది. ఓటు వేసేందుకు జనాలు బారులు తీరుతున్నారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ వైపు గ్రేటర్ జనాలు మొగ్గుచూపుతారు అనేది తెలియక గ్రేటర్ బరిలోకి దిగిన అభ్యర్థులతో పాటు, అన్ని పార్టీలు టెన్షన్ పెట్టుకున్నాయి. ఇక్కడ గెలిచిన పార్టీకే తర్వాత రాజకీయంగా మెరుగైన అవకాశాలు ఉండే అవకాశం ఉండటంతో, అన్ని పార్టీలు ఇక్కడ గెలవడం అత్యవసరం అన్నట్లుగా దృష్టిసారించాయి. ఇప్పటికి వాడివేడి ప్రచారాలతో వాతావరణం వేడి ఎక్కించేందుకు ప్రయత్నించాయి. 



ఇప్పటి వరకు చేసిన ప్రచారం అంతా, నేడు బ్యాలెట్ బాక్స్ లోకి ఓట్ల రూపంలో చేరబోతోంది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎపిక్ తో పాటు ,18 గుర్తింపు కార్డు లకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. ఈ కార్డులలో ఫోటోతో పాటు వివరాలు సక్రమంగా ఉండాలని పేర్కొంది. ఆధార్ కార్డు, పాస్ పోర్ట్,  డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, ఉపాధిహామీ బుక్ ఈఎస్ఐ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఉపాధిహామీ బుక్, ఈఎస్ఐ కార్డు, పింఛన్ కార్డు, రేషన్ కార్డు, కులం సర్టిఫికెట్, స్వాతంత్ర సమరయోధులు రికార్డు, ఆయుధం లైసెన్స్ కార్డు వికలాంగ సర్టిఫికెట్, పట్టాదారు పాసు పుస్తకం తదితర గుర్తింపుకార్డులను అధికారులకు చూపించి ఓటు హక్కు వినియోగించుకో వచ్చు. 



అయితే ఓటరు జాబితాలో ఓటరుగా నమోదు అయితేనే ఇందులోని ఏదైనా ఒక కార్డును చూపి ఓటు వేసుకోవచ్చు . లేదంటే ఎన్నికల అధికారులు తిరస్కరిస్తారు . అలాగే వార్డులలో పంచే ఓటర్ స్లిప్పులు కూడా ఓటు కు ప్రామాణికం కాదు . అవి ఓటర్ కు సంబంధించిన చిరునామా, ఇతర వివరాలను మాత్రమే తెలియజేస్తుంది .ఈ విషయాలన్నిటినీ ఓటు వేసే ముందు ఓటర్లు సమగ్రంగా తెలుసుకొని ఓటర్ కార్డు తో పాటుగా పైన గుర్తించబడిన ఏదైనా ఒక కార్డు తీసుకుని వెళ్లి ఓటు వేయాలి. లేదంటే ఓటు వేయడానికి అధికారులు అంగీకరించరు.

మరింత సమాచారం తెలుసుకోండి: