హైదరాబాద్ నగరంలో గ్రేటర్ ఎన్నికల జోరు భారీగా పెరుగుతుంది.. ఎన్నికలు ఈరోజు ఉదయం నుంచి మొదలయ్యాయి.. గత కొన్ని రోజులుగా గ్రేటర్ ఎన్నికల ప్రచారం తెలుగు ప్రజలను ఆలోచన పడేసింది.. ఎవరు గెలుస్తారో అన్న ఆసక్తి నానాటికీ పెరిగి పోతోంది. ఆ ఆలోచనకు ఈరోజు బ్రేక్ పడింది. ఈరోజు ఉదయం నుంచి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.. అత్యంత పకడ్బందీ ఏర్పాట్ల మధ్య 9 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లలో ఓట్లు వేసేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేకంగా తీసుకున్న ఏర్పాట్లు చేశారు..



ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఎటువంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే 50 వేల మంది పోలీసులు నగరమంతా వ్యాపించారు. ఓటర్లు ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ల పరిధిలోని అన్ని పోలింగ్‌ బూత్‌లు, చెక్‌పోస్టుల దగ్గర గట్టి భద్రత ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసులు మోహరించారు. నగరం నిఘా నీడలో ఉంది. పోలీసులు సిటీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ను అష్టదిగ్బంధం చేశారు. 9,101 పోలింగ్ స్టేషన్లకు గాను పది వేలకు పైగా పోలీసులను మోహరించారు.



అయితే ఈ ఎన్నికల్లో ఎవరిని విజయం వరిస్తుంది అనేది సర్వే వెల్లడించింది.. సర్వేలో కేసీఆర్ నాయకత్వం మళ్లీ జెండాను ఎగుర వేస్తుందని తేలింది..వివరాల్లోకి వెళితే..ఏబిపి-సి ఓటర్ నిర్వహించిన ఒక సర్వేలో టీఆర్ఎస్‌ మెజార్టీ సీట్లలో విజయం సాధిస్తుందని ప్రకటించింది.150 డివిజన్లలో టీఆర్ఎస్‌ 92-94 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, బిజెపి 10-12 సీట్లు, ఎంఐఎం పార్టీ 38-42 సీట్లను , ఇక కాంగ్రెస్ 2 నుంచి నాలుగు సీట్లను దక్కించికొనుందని వెల్లడించింది.. మొత్తానికి చూసుకుంటే మళ్లీ ఈ ఎన్నికలు కుడా తెరాసకు కలిసొస్తాయని తెలుస్తుంది.. ఆ ధీమా తోనే టీఆర్ఎస్ నేతలు గెలుపు సంబరాలను ముందే మొదలు పెట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి: