ముషీరాబాద్‌ నియోజకవర్గంలో పోలింగ్‌ 7గంటలకే ప్రారంభమయ్యింది. అధికారులు అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో 295 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఈ డివిజన్లలో మొత్తం 1180 సిబ్బందిని నియమించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో దాదాపుగా 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. బ్యాలెట్‌ బాక్సులను పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్‌ బూత్‌లకు తరలించారు. పోలింగ్‌ బూత్‌ల వద్ద బందోబస్తు సహితం ఏర్పాటు చేశారు. ఈరోజు(మంగళవారం) ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనున్నది.

ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఆయా పోలింగ్‌ బూత్‌ల వద్ద టెంట్‌, మంచినీటి సౌకర్యాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు పోలింగ్‌ స్లిప్‌లను అందజేశారు. కొంతమంది పార్టీల నేతలు కూడా పోలింగ్‌ స్లిప్‌లను అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకకుండా పోలింగ్‌ బూత్‌ల వద్ద ముందు జాగ్రత్తగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముషీరాబాద్‌, చిక్కడపల్లి, గాంధీనగర్‌, నల్లకుంట పోలీస్‌ స్టేషన్ల పరిధిలోకి వచ్చే పోలింగ్‌ బూత్‌ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

డివిజన్ల వారీగా ఓటర్ల వివరాలు చూస్తే.. ముషీరాబాద్‌ డివిజన్‌లో మొత్తం 46,613 ఓటర్లు ఉన్నారు. అందులో 24,314 పురుషుల ఓట్లు, 22,299 మహిళా ఓట్లు ఉన్నాయి. అడిక్‌మెట్‌ డివిజన్‌లో మొత్తం ఓటర్లు 42,039 ఉండగా పురుషులు 21,574, మహిళా ఓటర్లు 20,464 ఉన్నారు. భోలక్‌పూర్‌లో మొత్తం ఓటర్లు 53,435 ఉండగా పురుషులు 28,165, మహిళా ఓటర్లు 25,268 ఉన్నారు. గాంధీనగర్‌ డివిజన్‌లో మొత్తం ఓటర్లు 47,917 ఉండగా పురుషులు 24,648, మహిళా ఓటర్లు 23,267 ఉన్నారు. రాంనగర్‌ డివిజన్‌లో 49,676 ఓటర్లు ఉండగా పురుషులు 25,952, మహిళా ఓటర్లు 28,724 ఉన్నారు.  కవాడిగూడ డివిజన్‌లో మొత్తం ఓటర్లు 51,461 ఉండగా పురుషులు 26,262, మహిళా ఓటర్లు 25,196 ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: