గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇప్పుడు ఎక్స్ అఫిషియో ఓట్లు చాలా కీలకం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే టిఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా ఈ ఓటింగ్ ఉంది. కాబట్టి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. 52 ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలందరూ అదేవిధంగా ఎంపీలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయనున్నారు. 202 మంది మేయర్ ను ఎన్నుకొంటారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 102 స్థానాలు గెలిస్తే ఆ పార్టీకి మేయర్ పదవి దక్కుతుంది.

కాబట్టి ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి. అయితే టిఆర్ఎస్ పార్టీ 60 నుంచి 70 స్థానాలు గెలిస్తే కచ్చితంగా మేయర్ పదవిని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఇప్పుడు మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఇతర పార్టీల మీద ఆధార పడే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ సహకారాన్ని స్వతంత్ర పార్టీల సహకారాన్ని తీసుకోవడానికి బీజేపీ నేతలు ఆఫర్లు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఐదు నుంచి ఆరు స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి.

కాబట్టి ఈ ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది చూడాలి. అయితే భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య వైరం ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఎంత వరకు బీజేపీకి మద్దతు ఇస్తారు అనేది చూడాలి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే దాదాపుగా పది మందిని ఇప్పటికే బీజేపీ తమ పార్టీలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది రెండు మూడు రోజుల్లో స్పష్టత రానుంది. టిఆర్ఎస్ పార్టీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: