గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ఎస్టేట్ రంగం పెద్ద ఎత్తున విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అయితే ఈసారి వారు ఎవరికి ఓటు వేస్తారు ఏంటి అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వారు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలుస్తారా లేదా అనేది చెప్పలేని పరిస్థితి ఉంది.

అయితే రెండు నెలల పాటు గ్రేటర్ హైదరాబాద్ సహా తెలంగాణ పరిధిలో రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగం పెద్ద ఎత్తున ఇబ్బందులు పడింది. ఆ వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వంపై పడే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ నిర్మాణ విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కొన్ని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. అయితే కొన్ని కొన్ని ధరలు పెరగటం కూడా వారిని ఇబ్బంది పెట్టింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు అనే భావన చాలామందిలో ఉంటుంది.

కాబట్టి వారు ఎంత వరకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటారు ఏంటి అనేది చూడాలి. అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాదులో మత విద్వేషాలకు తావు ఉండే అవకాశం ఉందనే ప్రచారం భారతీయ జనతా పార్టీ ని టార్గెట్ గా చేసుకుని టిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. కాబట్టి వారు ఎంతవరకు బిజెపికి ఓటు వేస్తారు అనేది చూడాలి. అయితే ఇతర రాష్ట్రాల నుంచి అంటే ప్రధానంగా ఉత్తరాది నుంచి వచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కార్మికులు మాత్రం బీజేపీ ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: