ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు పై అనర్హత వేటు వేయడానికి రంగం సిద్ధం చేసినట్లుగా కనిపిస్తుంది. అసెంబ్లీ లో టీడీపీ సభ్యల సస్పెన్షన్ తర్వాత పరిస్థితులు చూస్తే ఇదే నిజమనిపిస్తుంది. ఆయనపై పూర్తిగా అనర్హత వేటు వేయకపోయినా ఓ రెండు మూడు ఏళ్ల పాటు ఈ సస్పెన్షన్ ని పొడిగిస్తారని చెప్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ షాక్ తిన్న చంద్రబాబు కు తిరుపతి ఉప ఎన్నిక విషయంలో పనబాక లక్ష్మి కొంత టెన్షన్ పెట్టిందని చెప్పొచ్చు.. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిత్వం ఖరారయినా కాలు బయటపెట్టేందుకు బెట్టు చేసిన పనబాక లక్ష్మి ఇప్పుడు ఓ మెట్టు దిగినట్టు తెలుస్తోంది.

అసలు జరిగిన విషయం ఏంటంటే తిరుపతి అభ్యర్థి గా పనబాక లక్ష్మి ని చంద్రబాబు ఎంపిక చేశారు.. ఇక్కడ గెలుపు ధీమా తో ప్రచారం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.. కానీ అనూహ్యంగా చంద్రబాబు ఎంత చెప్పినా ఆమె కాలు బయటపెట్టకపోవడం టీడీపీ క్యాడర్ ను కలవరపెట్టింది..అది ఇప్పుడు సద్దుమణిగిన అసెంబ్లీ లో చంద్రబాబు పై పడిన సస్పెన్షన్ వేటుపై ఇప్పుడు అన్తరా చర్చించుకుంటున్నారు.

టీడీపీ సభ్యులందరూ సస్పెన్షన్ కారణంగా బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వతా అసెంబ్లీలో చంద్రబాబు ప్రవర్తనను ఖండిస్తూ తీర్మానం చేశారు. చంద్రబాబు వ్యవహారశైలిపై రూల్ 77 ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. దీన్ని పరిశీలనలోకి తీసుకుంటున్నామని స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.అలాగే సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని కూడా చెప్పేశారు. సభలో దురదృష్టకరమైన పరిణామం ఎప్పుడూ చూడలేదని.. ప్రతిపక్ష నేత కన్‌ఫ్యూజన్‌లో పడ్డారని తమ్మినేని సీతారాం విమర్శించారు. రాజ్యాంగ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని హితవు పలికారు. తీర్మానం చేసినందున ఇప్పుడు స్పీకర్ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. గతంలో తెలంగాణ అసెంబ్లీలో గలాటా సృష్టించారని ఎమ్మెల్యేలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌ల శాసనసభ్యత్వాలను స్పీకర్ మధుసూదనాచారి రద్దు చేశారు. ఇప్పుడు.. చంద్రబాబుపైనా అలాంటి చర్య తీసుకునే అవకాశాల్ని పరిశీలించవచ్చని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: