గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక గ్రేటర్ పరిధిలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మరీ ముఖ్యంగా బల్దియా పోరులో రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకున్నాక మద్యానికి గిరాకీ పెరిగిందని అంటున్నారు. కరోనా నేపథ్యంలో మద్యం అమ్మకాలు భారీగా పడిపోయాయి. అయితే మళ్ళీ ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ భారీగా గిరాకీ పెరిగింఫీ.

ఈ క్రమంలో ఈ నెల 23న రూ.135 కోట్లు, 24న రూ.107 కోట్లు, 25న రూ.102 కోట్లు, 26న రూ.58 కోట్లు, 27న రూ.170 కోట్లు, 28న రూ.176 కోట్లు, 29న రూ.108 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని అబ్కారీ అధికారులు పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల దృష్ట్యా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయని, సాధారణ రోజుల్లో విక్రయాల కంటే 40 శాతం ఎక్కువగా జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రోజుకు వంద కోట్ల చొప్పున మద్యం అమ్మకాలు జరుగుతున్నాయట. 2019 నవంబర్ 29 వరకు రూ.2,239 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.

 ఈ ఏడాది అదే సమయంలో రూ.2,567 కోట్ల మద్యం విక్రయాలు జరుగగా, గతేడాదితో పోల్చితే దాదాపు మూడు వందల కోట్ల విలువైన మద్యం అధికంగా విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. ఇక రెండు రోజులు మద్యం షాపులు మూసి ఉన్న క్రమంలో బల్దియా ఫలితాల అనంతరం రెండు రోజుల పాటు మద్యం విక్రయాలు అధికంగా జరిగే అవకాశం ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి,రెండు రోజుల పాటు మద్యం విక్రయాలు మళ్ళీ ఊపందుకుంటాయి అని ఎక్సైజ్ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: