పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి సినిమాలపై దృష్టి పెట్టారు.. దాదాపు ఐదు సినిమాలు అయన సెట్స్ మీద ఉంచారు.. ఒకదానికొకటి విభిన్నమైన సినిమాలు కావడంతో ఈ సినిమా లపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు న్నాయి.. ఇదిలా ఉంటే ఏపీ లో బీజేపీ తో పొత్తులో ఉన్న జనసేన పార్టీ తెలంగాణ లో కూడా బీజేపీ పార్టీ తో ఉంటామని ప్రకటించారు. జనసేన అధినేత గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకే మా మద్దతు అని ప్రకటించారు. అయితే ఇష్టంగా చెప్పారా, లేదా అయిష్టంగా చెప్పారా అనేది తెలియదు.

అయన చెప్పిన తీరు చూస్తూనే మాత్రం అయిష్టంగా చెప్పినట్లే కనిపిస్తుంది. బీజేపీ గెలుపు కోసం జనసైనికులు కృషి చేయాలని కోరారు. అయితే పవన్ ఇది చెప్పినా బలవంతాన గ్రేటర్ లో జనసేన ని పాల్గొననివ్వకుండా చేశారన్నది బయటకి పొక్కిన వార్త.. అందుకు తగ్గట్లే పవన్ కళ్యా్ణ్ ఈ నిర్ణయం వల్ల సొంత పార్టీతో పాటు బయటి నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. తెలంగాణ లో ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఇలా బీజేపీ సపోర్ట్ చేయడం పెద్ద దెబ్బ అని జనసేన నేతలు అభిప్రాయపడ్డారు.. కానీ... జాతి హితమే తనకు ముఖ్యమని, అందుకోసమే బీజేపీకి మద్దతిచ్చామని జస్టిఫై చేసుకున్నారు.

ఏదేమైనా పవన్ కళ్యాణ్ సినిమాల పరంగా ఫిఫ్త్ గేర్ వేసినా పొలిటికల్ గా మాత్రం సెకండ్ గేర్ వేయట్లేదు.. పోనీ అయన త్యాగాని బీజేపీ గుర్తిస్తుందా అంటే అదీ లేదు.. బీజేపీతో కలిసి నడవాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ అడగకపోయినా నా సైన్యం మీకోసమే అని పదే పదే ప్రకటిస్తున్నారు. తన విదేయతను చాటుకునేందుకు ఇప్పటికే ఢిల్లీ పెద్దలను కూడా కలిసొచ్చారు. పవన్ కళ్యాణ్ కేంద్రంలోని బీజేపీ నేతలను మెప్పించే పనిలో ఉంటే... రాష్ట్ర నేతలు మాత్రం మేము ఆయన మద్దతు కోరలేదని చెబుతున్నారు.  గ్రేటర్ ప్రచారంలో ఎక్కడా కనిపించని జనసైనికులు అమిత్ షా రోడ్ షోలో కనిపించడం కాకతాళీయం ఏమాత్రం కాదు. ర్యాలీలో పాల్గొన్న జన సైనికులు పవన్ కళ్యాణ్ తో పాటు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు జైకొట్టారు. ఇదంతా ఢిల్లీ పెద్దల దృష్టిలో పడే ప్రయత్నమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: