జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ప్రస్తుతం 150 డివిజన్లలో ఎన్నికలు పోలింగ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.  ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు  అందరూ ప్రస్తుతం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు అయితే మొన్నటివరకు ప్రచారం చేపట్టి ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసిన అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు ఓటర్లు.



 ఈ క్రమంలోనే ఈ జిహెచ్ఎంసి ఎన్నికలు ఎంతో రసవత్తరంగా సాగుతుంది అన్న విషయం తెలిసిందే.  అన్ని పార్టీలు జిహెచ్ఎంసి ఎన్నికలను  ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో జిహెచ్ఎంసి ఎన్నికలు ఆసక్తికరంగా మారిపోయాయి.  అయితే జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు తమ దైన వ్యూహాలతో ప్రచారం నిర్వహించాయి. ఓటర్లను ఏ పార్టీ ఆకట్టుకున్నది  ఓటర్లు ఏ పార్టీకీ ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ శాతం ఎంత నమోదు అవుతుంది అన్నది కూడా ఆసక్తి కరం గా మారిపోయింది. కాగా ప్రస్తుతం అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది అనే విషయం తెలిసిందే.



 సాధారణంగానే గ్రేటర్ ఎన్నికలు అనేసరికి పోలింగ్ మందకొడిగా జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎక్కువ మంది ఓటర్లు ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపరు. ఈ ఎన్నికల్లో కూడా ఎప్పటిలాగే మందకొడిగా సాగుతుంది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కు సంబంధించిన పోలింగ్. గత మూడు గంటల్లో కేవలం 4.02 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడం గమనార్హం.  అయితే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉన్న నేపథ్యంలో ఇక మెల్లగా ఓటు వేయాలని భావిస్తున్న ఎంతో మంది ఓటర్లు ఉదయం సమయంలో ఎక్కువగా పోలింగ్ కేంద్రాల వద్దకు రావడం లేదు.  ఇక సాయంత్రం సమయంలో ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: