గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇప్పుడు పాతబస్తీ ప్రాంతాల్లో ఓ పోలింగ్ విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయలేదని వెనక్కు తగ్గారు. ఓటు వేయడానికి వెళ్లిన వాళ్లు కూడా ఇప్పుడు ఓటు వేయకుండానే బయటకు రావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల సంఘం మాత్రం ఓట్లను 100% పంపిణీ చేశామని చెబుతున్నారు. అయినా సరే అందుకు తగిన విధంగా అక్కడ పరిస్థితి కనబడటం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

పోలింగ్ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం అన్ని చర్యలు చేపట్టినా సరే ఆ విధంగా పరిస్థితి లేదు. రాజకీయంగా ఈ  ఎన్నికలు చాలా కీలకంగా ఉన్న సమయంలో ఇలాంటి తప్పులు ఎన్నికల సంఘం చేయడం ద్వారా అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2018 ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఎన్నికల సంఘం తప్పులు ఎక్కువగా చేస్తుంది. ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయకపోవడంతో పాతబస్తీ ప్రాంతాల్లో చాలా వరకు కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఇదంతా తమ మీద చేస్తున్న కుట్ర అని మజ్లీస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ బిజెపి మధ్య పాతబస్తీలో ఎక్కువగా పోటీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎలాంటి చర్యలు ఉంటాయి ఏంటి అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ముస్లిం ఓటర్లకు స్లిప్పులను ఇవ్వలేదు అని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. అయితే ఎవరికి అయితే అందలేధో వారందరికీ కూడా తాము అందిస్తామని ఇతర గుర్తింపు కార్డులను కూడా తీసుకుని వచ్చి ఓటు వేయవచ్చు అని చెబుతున్నారు. అయితే బూత్ ఎక్కడ ఉందో తెలియక ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: