హైదరాబాద్ లో ఎన్నికల వేడి ఉదయం నుంచి కొనసాగుతుంది.. పోలీసుల అదుపులో ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి..ఈ ఎన్నికల్లో విజయం ఎవరిది అనేది నాలుగో తేదీ తెలియనుంది.. కానీ ఎవరికీ ఓట్లు వేశారు అనేది మాత్రం ఇక్కడ పరిగణలోకి  తీసుకుంటున్నారు.నగరంలోకి ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఓటింగ్ పూర్తయ్యింది..ఇక సెలెబ్రెటీలు ఎన్నికల్లో చురుగ్గా పాల్గొంటూ వారి ఓట్లను వేస్తున్నారు. వారికి ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నారు.



నిన్నటివరకు ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగింది.. ఇప్పుడు మాత్రం నేతల్లో గెలుపు టెన్షన్ పట్టుకుంది.. ఏ ప్రాంతంలో ఎవరు విజయాన్ని అందుకుంటారు అని జనాలు కూడా ఆలోచనలో పడ్డారు..9,101 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ప్రస్తుతానికి  ప్రశాంతంగా జరుగుతున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఓటర్లకు , అభ్యర్థులకు చిన్నపాటి ఘర్షణలు జరిగినా పోలీసుల చొరవతో సర్దుమనిగాయి. ఇకపోతే నగరంలో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌.. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఓటర్లు మాస్కులు ధరించి.. కరోనా రూల్స్‌ పాటిస్తూ ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు.



మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌ క్లబ్‌కు చేరుకున్న చిరంజీవి దంపతులు ఓటు చేశారు. కానీ మీడియా తో మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయారు.. చిరు సైలెంట్ వెనక ఏ రహస్యం దాగుందో తెలియలేదు..అమీర్‌పేటలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుమారుడు భార్యతో కలిసి ఓటు వేసారు అంజనీకుమార్. ప్రశాంత ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని.. ప్రజలు నిర్భయంగా ఓటు వినియోగించుకోవాలని ఈ మేరకు పిలుపునిచ్చారు..డైరెక్టర్ క్రిష్ కూడా ఇక్కడే తన ఓటును వినియోగించుకున్నారు.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 లో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  ఓటు వేస్తేనే ప్రశ్నించగలరని పేర్కొన్నారు అరవింద్‌ కుమార్‌. కరోనా జాగ్రత్తలతో పోలింగ్ జరుగుతోందని.. అందరూ పోలింగ్ లో పాల్గొనాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: