తెలంగాణ రాజకీయాలను ఊపేసిన గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఉదయం నుంచి ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ క్రమంలో నే ప్రస్తుతం తమ ఓటు హక్కును వినియోగించుకుని తమ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు గ్రేటర్ పరిధి లోని అందరూ ఓటర్లు కూడా సిద్ధమయ్యారు ఈ క్రమం లోనే అందరూ ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు అయితే ఇప్పటి వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ సజావుగానే సాగుతోంది అని చెప్పాలి.



 ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రస్తుతం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజుల నుంచి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా నిఘా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.జి  హెచ్ ఎం సి ఎన్నికల నేపథ్యం లో సుమారు 50వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు నగరం మొత్తం. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఎన్నికల అధికారులు ఆయా ప్రాంతాలలో మరింత పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేసేందుకు కేంద్ర బలగాలను తరలించారు. ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.



 పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువ ఓటర్లు గుమి  కూడా కాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఓటర్లు ఎంతో ధైర్యంగా పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలింగ్ బూత్ లలో  కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిఘా ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: