జిహెచ్ఎంసి ఎన్నికల కు సంబంధించిన పోలింగ్ షురూ అయింది. ఇక జిహెచ్ఎంసి ఓటర్లు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పోలింగ్ ప్రారంభం కావడం తో జీహెచ్ఎంసీలో ఉన్న ఓటర్లు  ప్రస్తుతం మార్పు కోసం అభివృద్ధి కోసం తన ఓటు హక్కును వినియోగించు కునేందుకు సిద్ధమయ్యారు అన్న విషయం తెలిసిందే. ఇక తమ డివిజన్ల లో అభివృద్ధి కోసం సరైన అభ్యర్థులను ఎన్నుకునేందుకు ఓటు వేసి తమ సత్తా చాటేందుకు ఓటర్లు అందరూ పోలింగ్ కేంద్రాల వద్దకు  బారులు తీరుతున్నారు ఓవైపు కరోనా  వైరస్ నిబంధనలు పాటిస్తూ నే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు ప్రస్తుతం ఓటర్లు.


 ఈ క్రమంలోనే గ్రేటర్ పరిధిలో ని ఏ పోలింగ్ కేంద్రంలో చూసిన భారీగా ఓటర్లు  కనిపిస్తుంది. మొన్నటి వరకు ముమ్మర ప్రచారం నిర్వహించిన అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చ బోతున్నారు ఓటర్లు ఇక ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈనెల 4వ తేదీన వెల్లడికానున్నాయి అన్న విషయం తెలిసిందే.  ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 9101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తంగా జిహెచ్ఎంసి పరిధిలో 150 డివిజన్లో ఎన్నికలు జరుగుతుండగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో  కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి.



 ఇకపోతే ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ మరింత ఆసక్తిని సంతరించుకుంది ఎందుకంటే దాదాపు 18 ఏళ్ల తర్వాత మొదటిసారి కొత్త పద్ధతిలో జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగనుంది. 18 ఏళ్ల తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతూ ఉండటం ప్రస్తుతం మరింత ఆసక్తికరం గా మారిపోయింది. అయితే ప్రస్తుత పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉదయం నుంచే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఎక్కువగా పోలింగ్ కేంద్రాల వద్దకు  బారులు తీరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: