జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ నేడు ఉదయం నుంచి ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే ఇక మొన్నటివరకు జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించి ప్రచారం హోరాహోరీగా జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో భారీ మెజారిటీ సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని అన్ని పార్టీలు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఈ క్రమంలోనే ముమ్మర ప్రచారం నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేశారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నికల్లో చేదు అనుభవాన్ని రుచి చూసిన టిఆర్ఎస్ పార్టీ ఎట్టి  పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ ఎన్నిక లో మేయర్ పీఠాన్ని  దక్కించుకొని మళ్ళీ ఆధిపత్యం సాధించాలని భావించింది.



 ఈ క్రమంలోనే జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీ హామీల వర్షం కూడా కురిపించింది అన్న విషయం తెలిసిందే. టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ కూడా ముమ్మర ప్రచారం చేపడుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నువ్వా నేనా అంటూ సాగిన పోరుకు పరీక్ష నేడు జరుగనుంది. ఉదయం నుంచే ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇక అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. ఇక మొన్నటివరకు ప్రచారం నిర్వహించి ఆకర్షించిన అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు.



 కాగా దాదాపు 18 ఏళ్ల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు మళ్లీ బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతుండటంతో మరింత ఆసక్తికరం గా మారిపోయింది జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్. అయితే ఈ కొత్త పద్ధతి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. కాగా నేడు జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక ఫలితాలు 4వ తేదీన వెల్లడికానున్నాయి అన్న విషయం తెలిసిందే. కాగా రాష్ట్రవ్యాప్తంగా 9101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: