మందకొడిగా సాగుతున్న గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటలకి పోలింగ్ మొదలైన ఇప్పటివరకు ఆయా పోలింగ్  కేంద్రాలలో  ఓటు వేసే వాళ్లు చాలా తక్కువగా కనిపించడం విశేషం ..అయితే   ఇప్పటివరకు చుస్తే   కేవలం మూడు శాతం మాత్రమే  పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు ..

పోలింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లో అనేక సినీ ప్రముఖులు మరియు  రాజకీయ ప్రముఖులు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.. వీరితో పాటు తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్ కుమార్ మరియు సైబరాబాద్   పోలీస్ కమిషనర్ సజ్జనార్ , తెలంగాణ డిజిపి మహేందర్,నగర్ మేయర్ దంపతులు తమ  ఓటు హక్కును వినియోగించుకున్నారు

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినా కూడా నగరవాసులు పోలింగ్ కేంద్రాల వైపు  చూడడానికి ఇష్టపడడం లేదు.. దీంతో నగరంలోని పోలింగ్ కేంద్రాలు  ఓటర్లు లేక వెలవెలబోతున్నాయి..
అంతేకాదు ఐటీ పరిసర ప్రాంతాల్లోనూ ఇంకా పోలింగ్  మొదలవలేదు. అధికారులందరూ ఓటర్ల కోసం ఎదురుచూస్తున్నా ఓటు వేసేందుకు ప్రజలు ఇంకా ముందుకు రావడం లేదు..

అయితే  ఈరోజు గ్రేటర్ పోలింగ్ కావున పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి.. బిజెపి మరియు టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి .. అయితే పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకోవడంతో విషయం సద్దుమణిగింది..

గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూస్తే పోలింగ్ శాతం విలువ చాలా తక్కువగా ఉంది.. గత ఎన్నికల్లో కేవలం 42 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడం విశేషం.. అయితే ఈసారి ఆ పోలింగ్ శాతాన్ని పెంచేలా అధికారులు చర్యలు చేపట్టారు ..
కరోనా సమయంలో లోఎన్నికలు రావడంతో పోలింగ్ కేంద్రాలలో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టి పోలింగ్ శాతాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలుపుతున్నారు ..

కేవలం తొలి రెండు గంటల్లోనే 3 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడం అధికారు ఆందోళన పడుతున్నారు .. ఇది   ఇలానే కొనసాగితే గత ఎన్నికల మాదిరి ఈ ఎన్నికల్లోనూ అంతే పోలింగ్ శతం లేదా అంతకంటే తక్కువే నమోదు కావచ్చుననే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.. కాబట్టి  నగరవాసులారా మీ అమూల్యమైన నా ఓటు హక్కును వినియోగించుకోండి పోలింగ్ శాతాన్ని పెంచండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: