ప్రస్తుతం గ్యాస్ వాడకం ఎంతలా పెరిగిపోతుందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే గ్యాస్ వినియోగం కూడా రోజుకు అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగిపోతుండటం సామాన్య ప్రజల బెంబేలిత్తిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఒకటో తేదీ వచ్చిందంటే చాలు గ్యాస్ సిలిండర్ ధర ఎలా పెరిగిపోతుందని వినియోగదారులందరూ ప్రస్తుతం బెంబేలెత్తిపోతున్నారు . అయితే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ వినియోగదారులందరికీ ఊరట కలిగించే ఒక తీపి కబురు అందింది. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర ఏమాత్రం పెరగకుండా నిలకడగానే కొనసాగడం అందరికీ ఊరటనిచ్చే గుడ్ న్యూస్ అని చెప్పాలి.



 ఈ నెలలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర లో మార్పులు వచ్చే అవకాశం ఉందని ధర పెరుగుతుందని గత కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోన్న  పక్షంలో గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఆందోళన చెందారు. అయితే ఈ నెల గ్యాస్ సిలిండర్ ధరలో  కూడా ఎలాంటి మార్పు లేదు అని చెప్పవచ్చు. గత కొన్ని నెలల నుంచి కూడా గ్యాస్ సిలిండర్ ధర లో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక గ్యాస్ సిలిండర్ ధర ఈ నెల కూడా నిలకడగా కొనసాగడంతో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వినియోగదారులందరికీ ఎంతగానో ఊరట కలిగే అంశం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలు ఎలాంటి మార్పు లేదు అయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మాత్రం 19 కిలోల గ్యాస్ సిలిండర్ మార్పులు చేసి ధరలు పెంచాయి. ఈ క్రమంలోనే 19 కేజీల సిలిండర్ ధర 55 రూపాయలకు పైగా పెరిగింది. ఐఓసీ  వెబ్సైట్ ప్రకారం ఢిల్లీలో 14 కేజీల సిలిండర్ ధర 594 రూపాయలు ఉండగా ముంబైలో ఇది కొనసాగుతుంది, కానీ చెన్నై లో మాత్రం 610 రూపాయలుగా 14 కేజీల సిలిండర్ ధర ఉండగా కోల్కతాలో 620 గా ఉంది. అదే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర విషయానికి వస్తే.. చెన్నైలో ఈ గ్యాస్ సిలిండర్ ధర రూ.56 పెరుగుదలతో రూ.1410కు చేరింది. ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ.1296 వద్ద ఉంది. రూ.55 పెరిగింది. కోల్‌కతాలో ధర రూ.1351గా, ముంబైలో ధర రూ.1244గా ఉంది. ఈ ప్రాంతాల్లో సిలిండర్ ధర రూ.55 చొప్పున పైకి కదిలింది

మరింత సమాచారం తెలుసుకోండి: