గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆశించిన విధంగా పోలింగ్ జరుగడం లేదు. ఈ ఎన్నికల్లో ఆయన పోలింగ్ జరుగుతుంది అని భావించిన సరే రాజకీయ పార్టీలకు ఊహించని విధంగా షాక్ తగిలింది. పెద్దగా ప్రజలు ఎవరూ కూడా ఓటింగ్ చేయడానికి ముందుకు రాకపోవడంతో ఇప్పుడు రాజకీయంగా అసలు ఎన్నికలు ఏ మలుపు తిరుగుతాయి ఏంటి అనేది సర్వత్రా ఆసక్తికరంగా ఉంది. పాతబస్తీ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పందేలు జరుగుతున్నాయి. పాతబస్తీలో కొంత మంది ఓటర్లకు స్లిప్పులు కూడా అందడం లేదు అని ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి.

దీంతో ఓటు వేయడానికి వచ్చిన వాళ్లు కూడా వెనక్కి తగ్గారు. ఇక ఈ ఎన్నికల్లో పోటీ రెండు పార్టీల మధ్యనే ఉంది. టీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఎక్కువగా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా ఇప్పుడు పోలింగ్ శాతం పెంచడానికి తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా తమకు పట్టున్న ప్రాంతాల్లో పోలింగ్ పెంచే విధంగా చర్యలు చేపట్టారు. తెరాస పార్టీ కీలక నేతలు అందరూ కూడా పోలింగ్ మీదనే దృష్టి సారించారు. అయితే టిఆర్ఎస్ పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు సమాచారం.

 పోలింగ్ పెంచడానికి అందరూ కూడా చర్యలు చేపట్టాలని ఓటర్లను బూతులకు తీసుకుని వెళ్లే విధంగా వెంటనే రంగంలోకి దిగాలని ఎక్కడైతే పోలింగ్ మందకొడిగా ఉందో ఆయా ప్రాంతాల్లో ఓటర్లను పోలింగ్ బూతులకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. దీనితో మంత్రి కేటీఆర్ సహా ఇతర మంత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ జరపడానికి ఆసక్తిగా ఉన్నారు. బీజేపీ నేతలు కూడా పోలింగ్ పెంచే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. బీజేపీ కీలక నేత అందరూ కూడా కార్యకర్తలతో చర్చలు జరిపి పోలింగ్ పెంచే దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు అయితే నాలుగు శాతం పోలింగ్ మాత్రమే గ్రేటర్ ఎన్నికల్లో నమోదయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: