ఉదయం నుంచి నగరమంతా ఓటర్లలో కిట కిట లాడుతుంది..ముఖ్యంగా చెప్పాలంటే ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో రాజకీయ నేతలు ఒకవైపు , మరోవైపు పోలీసులు ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూసుకుంటున్నారు..అయితే కొన్ని ప్రాంతాల్లో ఇరు పార్టీలకు అతీతంగా ఎన్నికల కమీషన్ వ్యవహరిస్తున్న కొందరు ఆరోపణలతో ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో చొరబడుతున్నారు. పోలీసులు జోక్యం చేసుకున్న కూడా నేతలు మాట వినడం లేదని తెలుస్తుంది..



బీజేపి నేతలు మొన్నటి వరకు మత కలహాలను సృష్టించిన సంగతి తెలిసిందే .. మతాల మధ్య గొడవలకు ఆద్యం పోశారు. ఒక వర్గంవారి ఓట్లను రాబట్టడమే లక్ష్యంగా ప్రచారం నిర్వహించింది. సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ, జాతీయ నేతలను హైదరాబాద్‌ గల్లీల్లో తిప్పితూ ఓటర్లను తమవైపు ఆకర్షించడానికి ప్రయత్నించారు. ప్రచారపర్వం ముగియడంతో ఓటర్లకు డబ్బులు పంచుతూ ఆ పార్టీ నేతలు అడ్డంగా దొరికిపోయారు.



ఇప్పుడు మాత్రం ఓటర్ల దృష్టిని తమవైపు తిప్పుకోవడానికి కమలం పార్టీ కొత్త నాటకాలకు తెరతీసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా వ్యహరిస్తున్నదని, ప్రభుత్వానికి అనుకూలంగా పనుచేస్తున్నదని ఆరోపిస్తూ ఆ పార్టీ నేతలు ఎస్‌ఈసీ కార్యాలయం ఎదుట హంగామా సృష్టించారు. ఎస్‌ఈసీ, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్నికల కార్యాలయంలోకి దూసుకెళ్లేందు ప్రయత్నించారు.ఈ మేరకు పోలీసులు అలెర్ట్ ఎక్కడిక్కడ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు హఫీజ్ పేటలో కూడా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.. మిగిలిన చోట్ల మాత్రం ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. ఇప్పటికే 40శాతం పూర్తయినట్లు తెలుస్తుంది.. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఎన్నికలలో అధికార పార్టీ టీఆరెఎస్ గెలుపు ఖాయమని అంటున్నారు. ఓ సర్వే కూడా అదే చెప్పింది.. అతి తక్కువ స్థానాల్లో బీజేపి గెలుస్తుందని అంచనా.. మరి నాలుగో తేదీ పార్టీ జాతకాలు బయటపడనున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: