గ్రేటర్ ఎన్నికల గురించి చాలా కాలంగా అధికార పార్టీ ఆలోచన చేస్తూ వస్తోంది. ఎటూ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి రాజధాని నగరం అయిన హైదరాబాద్ లో టీయారెస్ జెండావే ఎగరాలి.  కచ్చితంగా అదే జరగాలి అన్న పట్టుదలతో చాలా నెలలుగా టీయారెస్ పనిచేసుకుంటూ వచ్చింది. హైదరాబాద్ కి వరదలు కనుక లేకపోయి ఉంటే గ్రేటర్ ఎన్నికలు వేరేలా ఉండేవన్న భావన ఉంది. ఇక దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం మరో వైపు సలుపు పెడుతున్న వేళ గ్రేటర్ కి ముందస్త్ తెచ్చి జబర్దస్తుగా మేయర్ పీఠం కొట్టాలని టీయారెస్ వ్యూహం రచించింది.

అయితే ఈసారి సెంచరీ కొట్టి తీరుతామని తొడగొట్టి మరీ బరిలోకి దూకిన టీయారెస్ కి ఆ ముచ్చట తీరే చాన్స్ లేదా అన్న డౌట్లు వస్తున్నాయి. పోలింగ్ జరిగిన తీరును చూసినా ప్రచారంలో బీజేపీ విసిరిన బలమైన సవాల్ ని చూసుకున్నా కూడా గ్రేటర్ లో వందకు వంద సీట్లు టీయారెస్ కి వస్తాయనుకుంటే మాత్రం అది పొరపాటేనని అంటున్నారు.

టీయారెస్ కి కూడా సీన్ అర్ధమైనట్లుగా ఉంది. అందుకే ఎక్స్ అఫీషియే మెంబర్స్ తోనే కధ నడపాలనుకుంటోంది  అంటున్నారు. ఇదిలా ఉంటే గ్రేటర్ ఎన్నికల పట్ల జనాలు పూర్తి ఆసక్తి కనిపించకపోవడం టీయారెస్ కి కొంతలో కొంత ఊరట. నిజానికి అధికార పార్టీకి పోలింగ్ ఎంత తక్కువ అయితే అంత లాభం. ఇది చరిత్ర చెప్పిన నిజం. అయితే ఇపుడు చూస్తే పోలింగ్ సరళి ఎలా ఉన్నా కూడా ప్రజా వ్యతిరేకత ఎంతో కొంత ఉంటుందని టీయారెస్ కి అర్ధమైపోయింది. దాంతో మేయర్ సీటు పట్టేసేందుకు తన ఏర్పాట్లతో తాను ఉంది. ఏది ఏమైనా ఈసారి 110 సీట్లు అని చాలాకాలంగా టీయారెస్ చెబుతున్న మాట ఈ ఎన్నికల్లో నెరవేరే అవకాశాలు లేవు అనే పోలింగ్ తీరు బట్టి తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: