ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగబోతుంది అయితే నేడు ఓటర్లు అందరూ కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొన్నటివరకు ప్రచారం చేపట్టి ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేసిన అభ్యర్థులు యొక్క భవితవ్యాన్ని తేల్చనున్నారు. అయితే జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అనే విషయం తెలిసిందే. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.



 అంతేకాదు నగరాన్ని మొత్తం అదుపులోకి తీసుకుని ఎన్నికల పోలింగ్ సందర్భంగా నగరంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా నిఘా ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు అధికారులు కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు కూడా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరుతున్నారు. అయితే సాధారణంగా ఎన్నికల జరగగానే అభ్యర్థులు ఎవరు గెలుస్తారు అని అంచనా తో ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతుంటాయి అనే విషయం తెలిసిందే.



కానీ ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరిగినప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్స్ విడుదల కావు అన్నది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ పై  ఎన్నికల అధికారులు నిషేధం విధించారు. మలకపేట డివిజన్లో సిపిఐ పార్టీ అభ్యర్థికి సంబంధించిన గుర్తు కంకి కొడవలి కి బదులు సుత్తి కొడవలి అని రావడంతో.. ఇక అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ పోలింగ్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అక్కడ రీపోలింగ్ నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే రీపోలింగ్ ఉన్నందున సాయంత్రానికి విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ నిషేధిస్తున్నట్లు తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: