ఈరోజు జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ క్రమంలోనే ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. అయితే అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది అనుకుంటున్న తరుణంలో కొన్ని పోలింగ్ కేంద్రాలు అనుకోని సంఘటనతో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి అనే విషయం తెలిసిందే.




 ఇటీవలే హైదరాబాద్ ఓల్డ్ మలక్పేట డివిజన్ లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ను రద్దు చేస్తూ ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల పత్రాల్లో గుర్తులు తారుమారు కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఓల్డ్ మలక్పేట్ డివిజన్లోని 69 పోలింగ్ కేంద్రాల్లో కూడా రీపోలింగ్ చేయడం ప్రస్తుతం ఖాయంగా కనిపిస్తోంది. బాలెట్ పత్రాల్లో సీపీఐ అభ్యర్థి గుర్తు కంకి కొడవలి కాకుండా సుత్తి కొడవలి అని రావడంతో అసలు కథ మొదలైంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.



 దీంతో ఎన్నికల సంఘం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా పోలింగ్ నిలిపివేయాలని అధికారులు ప్రకటించారు. అయితే సీపీఐ కంకి కొడవలి గుర్తు స్థానంలో సుత్తి కొడవలి గుర్తు రావడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన చాడా వెంకటరెడ్డి వెంటనే ఎన్నికలు నిలిపివేయాలని డిమాండ్ చేయడంతోనే ఎన్నికల సంఘం ఈ తరహా నిర్ణయం తీసుకుంది. కాగా  ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది మధ్యాహ్నం కావొస్తున్నప్పటికీ ఎక్కువగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలోని మధ్యాహ్నం అయినప్పటికీ కూడా ప్రస్తుతం పోలింగ్ మందకొడిగా సాగుతోంది అయితే సాయంత్రం సమయంలో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ప్రస్తుతం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు  ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు అధికారులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: