గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చాలా వరకు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. జాతీయ రాజకీయాల మీద ఎన్నికలు ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి ఏంటి అనేది తెలియకపోయినా దక్షిణాదిలో మాత్రం భారతీయ జనతా పార్టీ అడుగులు పై ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఒక కర్ణాటక లో మహా భారతీయ జనతాపార్టీ దక్షిణాదిన ఎక్కడా కూడా బలంగా లేదు అనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ ఎన్నికలు ఆ పార్టీకి చాలా కీలకం కానున్నాయి.

భారతీయ జనతా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశాలు ఉంటాయి అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. చాలామంది భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం కూడా చాలా వరకు సమర్థవంతంగా చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ ప్రచారం ఆ పార్టీకి ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న చాలా మంది నేతలు ప్రచారంలో పాల్గొన్నారు.

దీని వలన టిఆర్ఎస్ పార్టీ కాస్త ఇబ్బందులు పడింది అనే విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. మరి ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో మాత్రం బీజేపీ అధిష్టానం చాలావరకు ఫోకస్ చేసింది. ఇక ఎన్నికల విషయంలో తమిళనాడు కూడా ఆసక్తికరంగానే చూస్తుంది అనేది చెప్పవచ్చు. మరి ఈ ఎన్నికలు ఏ విధంగా బీజేపీ కలిసి వస్తాయి అనేది రెండు మూడు రోజుల్లో ఓ క్లారిటీ రానుంది. తెలంగాణలో మాత్రం టిఆర్ఎస్ పార్టీ కచ్చితంగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఇన్ని రోజులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన చేసిన ఆ పార్టీ ఇప్పుడు ఇబ్బందులు పడవచ్చు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: