గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ మెజారిటీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించిన సరే ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పుడు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. భారతీయ జనతా పార్టీకి మేయర్ స్థానం దక్కక పోయినా సరే కొన్ని పరిణామాలు మాత్రం  భారతీయ జనతా పార్టీ   ద్వారా  టిఆర్ఎస్ పార్టీ ఎదుర్కొనే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు.

ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నుంచి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కేంద్రానికి భారీగా ఆదాయం వెళ్లి నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ నగరం నుంచి కచ్చితంగా ఇబ్బందులు టిఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవచ్చు. హైదరాబాద్ మేయర్ స్థానం కనుక భారతీయ జనతా పార్టీ గెలిస్తే టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎంత వరకు పార్టీలో ఉంటారు అనే దానిపై చెప్పలేము.

చాలా మంది కీలక నేతలు పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అగ్ర నేతలతో కూడా భారతీయ జనతా పార్టీ చర్చలు జరుపుతోంది. టిఆర్ఎస్ పార్టీ నీ దెబ్బ కొట్టడానికి భారతీయ జనతా పార్టీ ప్రతి అవకాశాన్ని కూడా వాడుకుంటూనే ఉంది అనే విషయం చెప్పవచ్చు. అయితే ఇంకా ఆ పార్టీ ప్రతిపక్షంలో నిలిస్తే కచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి ప్రశాంతతే ఉండకపోవచ్చు. దీనితో సీఎం కేసీఆర్ ఇప్పటి నుంచి గెలిచే అభ్యర్థులను కూడా కాపాడుకోవడానికి టిఆర్ఎస్ పార్టీ నేతలకు పలు సూచనలు కూడా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: