గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇప్పుడు పోలింగ్ శాతం భారీగా తగ్గడంతో టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం చాలా వరకు అభ్యర్థులు మీద సీరియస్ గా ఉంది. పోలింగ్ శాతం పెరిగితే టిఆర్ఎస్ పార్టీ విజయావకాశాలు మీద కాస్త ఆశలు ఉంటాయి. లేకపోతే మాత్రం అది భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉందని కూడా పలువురు అంచనా వేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా పోలింగ్ శాతం మీద ఆశలు పెట్టుకున్న కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ జరిగితే మాత్రం తమకు ఇబ్బంది అని భావిస్తోంది.

అందుకే పోలింగ్ శాతం తగ్గినా సరే బీజేపీ నేతలు పెద్దగా ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ పార్టీ కచ్చితంగా విజయం సాధించవచ్చు అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ కొంత మంది అభ్యర్థుల విషయంలో చాలా వరకు సీరియస్ గా ఉన్నారని సమాచారం. ఆయన తెప్పించుకున్న నిఘా వర్గాల సమాచారం ప్రకారం చూస్తే చాలా మంది అభ్యర్థులు ఓటర్లను పోలింగ్ బూత్ కి తీసుకువెళ్లి విషయంలో ఘోరంగా వెనుకబడి ఉన్నారు అని ప్రచారం జరుగుతుంది.

పోలింగ్ బూత్ కి తీసుకు వెళ్ళకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. సీఎం కేసీఆర్ కు అదేవిధంగా మంత్రి కేటీఆర్ సమాచారం అందింది. దీనితో కొంత మంది అభ్యర్థులకు గాను ఆయన ఫోన్ చేసినట్లుగా సమాచారం. బీజేపీ అభ్యర్థులు కూడా చాలా మంది పోలింగ్ విషయంలో ఆసక్తిగా లేరు. కొంత మంది టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం చేసుకునే విషయంలో వెనకబడి ఉండటమే కాకుండా బిజెపి మీద విమర్శలు చేసే విషయంలో కూడా వెనకబడి ఉన్నారు. ఇక బిజెపి కొన్ని ప్రాంతాల్లో ఇంకా ప్రచారం చేస్తుంది అని ఆరోపణలు ఉన్నా సరే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కొంతమంది ఘాటుగా విమర్శలు చేయలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: