గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎలా ప్రభావం చూపిస్తుంది ఏంటి అది తెలియక పోయినా ఇప్పుడున్న పరిణామాల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీ మాత్రం కచ్చితంగా 4 నుంచి 8 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత కూడా రావటం లేదు. ప్రస్తుతం రీ పోలింగ్ జరిగే అవకాశాలున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ రేపు విడుదల చేసే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. రేపు రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.

ఈ మేరకు ప్రకటన కూడా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచే వారితో టిడిపి నేతలు అందరూ కూడా చర్చలు జరుపుతున్నారు. భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలా అనే దానిపై ఇపుడు చాలా వరకు కూడా తెలుగుదేశం పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు కొంత మంది ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తో చర్చలు జరుపుతున్నారని టాక్. అటూ ఇటూ కాకుండా ఏదైనా ఫలితం వస్తే మాత్రం కచ్చితంగా వాళ్ళు మద్దతిచ్చే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఉన్న కొన్ని అంచనాల ప్రకారం చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినవారు తటస్థంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినా లేకపోతే బీజేపీ లోకి వెళ్ళినా సరే టీఆర్ఎస్ తో, భారతీయ జనతా పార్టీతో వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు అందరూ కూడా చర్చలు జరుపుతున్నారు. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది చూడాలి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అయిన తర్వాత ఆయన పార్టీ నేతలతో ఒక సమావేశాన్ని కూడా నిర్వహించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: