గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా  చేసుకుని ఆయన ఏ విధంగా విమర్శలు చేస్తారు ఏంటి అనేది చూడాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ తనను ఇబ్బంది పెట్టాలని భావిస్తోంది. కాబట్టి సీఎం కేసీఆర్ కూడా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తారు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే భారతీయ జనతా పార్టీకి ఎలాంటి బలం లేకపోయినా సరే తనను ఇబ్బంది పెట్టాలని భావిస్తోంది. కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలను అడ్డుపెట్టుకొని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తోంది. దీనివలన సీఎం కేసీఆర్ కూడా కాస్త ఎక్కువగానే ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ నేతలను కూడా తీసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

దీనివలన కొన్ని కొన్ని ఇబ్బందులు టిఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. బిజెపి చేస్తున్న కొన్ని కార్యక్రమాలను మాత్రం సీఎం కేసీఆర్ నేరుగానే ఎండగట్టే అవకాశం ఉందని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే టిఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు పడవచ్చు కాబట్టి ఇప్పుడు కొన్ని చర్యలకు సీఎం కేసీఆర్ దిగుతున్నారు. త్వరలోనే ఆయన ఢిల్లీ పర్యటన కూడా వెళ్లే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎటువంటి పరిణామాలు చోటుచేసుకున్నా సరే బీజేపీ మీద కచ్చితంగా యుద్ధం ప్రకటించాలని అన్ని రాష్ట్రాల ప్రతిపక్షాలను ఏకం చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: