జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ నివర్ తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 2 నుంచి పవన్ కళ్యాణ్ పర్యటన మొదలు కానుందని ఒక ప్రకటనలో తెలిపారు.
2న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 3, 4, 5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని పార్టీ నాయకులు వెల్లడించారు. నివర్ తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించి, పంట నష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. 2వ తేదీన ఉదయం 9.30 గంటలకు కృష్ణా జిల్లా ఉయ్యూరు చేరుకుంటారు. అక్కడి నుంచి పామర్ర, చల్లపల్లి, అవనిగడ్డ ప్రాంతాల్లో పర్యటిస్తారు. పులిగడ్డ వంతెన మీదుగా గుంటూరు జిల్లాకు వెళ్తారు.


గుంటూరు జిల్లాలో భట్టిప్రోలు, చావలి, పెరవలి, ప్రాంతాల మీదుగా తెనాలి, నందివెలుగు, కొలకలూరులో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. 3వ తేదీన పవన్ కళ్యాన్ తిరుపతి చేరుకుని చిత్తూరు జిల్లాలో వరద వల్ల జరిగిన పంట నష్టంపై పార్టీ నాయకులతో చర్చిస్తారు. 4వ తేదీన శ్రీకాళహస్తి ప్రాంతంలో పర్యటించి అక్కడి రైతాంగాన్ని కలుస్తారు..అక్కడి నుంచి నాయుడు పేట, గూడూరుల్లో పర్యటించి నెల్లూరు చేరుకుంటారు. 5వ తేదీన నెల్లూరు, రాపూరు, వెంకటగిరి ప్రాంతాల్లో పర్యటిస్తారు. ప్రభావిత జిల్లాల నేతలతో పవన్ కళ్యాణ్ నవంబర్ 29న టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: