గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలు ఉదయం నుంచి కాస్త ప్రశాంతంగా జరిగినా కూడా మధ్యాహ్నాం అయ్యేలోగా రచ్చలు మొదలయ్యాయి.. ఎన్నికల ప్రదేశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. పలు ప్రాంతాల్లో అల్లర్లు మొదలయ్యాయి. పోలీసులు ఎంతగా వాటిని అదుపు చేయాలని చూస్తున్నా కూడా రాజకీయ నాయకులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.. టీఆరెఎస్ నేతల పై బీజీపీ నేతలు, సభ్యులు దాడులకు, అల్లర్లకు పాల్పడుతున్నారు.పోలీసులు పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు తో పోలింగ్ ను ప్రశాంతంగా జరిగేలా చూస్తున్నారు..



జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ లో పలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు ఉదయం నుండి పలు చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గ్రేటర్ లో పోలింగ్ ప్రారంభం అయినప్పటి నుండి అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఘర్షణలకు దిగుతూనే ఉన్నారు . పోలీసులు వారిని చెదరగొట్టి పోలింగ్ ప్రశాంతంగా జరిగేలాగా చర్యలు తీసుకుంటున్నారు. కూకట్ పల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. రోడ్డుపైన నేతలు ష్ట్రీట్ ఫైటర్స్ లాగా నోటికి ఎదొస్తే ఆ పదాలను వాడుతూ గొడవ చేశారు..



ఫోరమ్ మాల్ సమీపంలో బీజేపి నేతలు, టిఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారు అంటూ బిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రవాణా శాఖ మంత్రి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనంలో డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ ఆయన కారుపై దాడి చేశారు..వీరి గొడవ కాస్త ఉద్రిక్తంగా మారడం తో దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది.డబ్బులు పంచుతున్నారని టిఆర్ఎస్ కార్యకర్త పై బిజెపి కార్య కర్తలు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. మంత్రి కాన్వాయ్ ని వెంబడించి మరీ అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు.. దీంతో మంత్రి అక్కడ నుంచి వెళ్ళి పోయాడు.. ఆ గొడవకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: