ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఏపీ సీఎంగా తోలగించాల‌ని వేసిన పిటిష‌న్  తో పాటు మ‌రో రెండు పిటిష‌న్ల ను  కొట్టివేస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం పేర్కోంది. ఏపీ హైకోర్టులోని అంశాల‌ను  సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి ప్ర‌భావితం చేస్తున్నారంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ కు రాసిన లేఖ  దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. 

సుప్రింకోర్టు న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణ‌, అలాగే  ఏపీ హైకోర్టు ప్ర‌ధాన  న్యాయ‌మూర్తితో పాటు మ‌రికొంత మంది న్యాయవాదులు ప్ర‌తిప‌క్ష పార్టీకి అనుకూలంగా ఉంటూ ఏపీ అభివృద్దికి అటంకం క‌లిగిస్తున్నార‌ని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ లేఖ‌లో పేర్కోన్నారు. అయితే సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ కు సీఎం జ‌గ‌న్ రాసిన లేఖ‌ను మీడియాకు విడుద‌ల చేయ‌డాన్ని కొంత మంది వ్య‌క్తులు అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. సుప్రీం కోర్టు త‌దుప‌రి  ప్రధాన న్యాయ‌మూర్తి రేసులో ఉన్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ పై రాసిన లేఖ‌ను బ‌హిర్గ‌త ప‌ర‌చ‌డం చ‌ట్ట విరుద్దం అంటూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసారు. దీంతో ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ , చీఫ్ జ‌స్టిస్ కు రాసిన లేఖ‌పై అభ్యంత‌రం తెలుపుతూ దాఖ‌లైన 3 పిటిష‌న్ల పై  జ‌స్టిస్ సంజ‌య్ కిష‌న్ కౌల్ నేతృత్వంలోని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం విచార‌ణ జ‌రిపింది.


 ఈ సంద‌ర్భంగా పిటిష‌న్ లో లేవ‌నెత్తిన అంశాలు ప‌రస్ప‌ర విరుద్దంగా ఉన్నాయ‌ని ధ‌ర్మాస‌నం పేర్కోంది. అయిన గ్యాగ్ ఆర్డ‌ర్ ఎత్తి వేసిన త‌ర్వాత లేఖ‌పై ఎలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ధ‌ర్మాస‌నం పిటిష‌నర్ల‌ను ప్ర‌శ్నించింది. ప‌త్రిక‌ల్లో వార్త‌ల‌ను చూసి పిటిష‌న్లు దాఖ‌లు చేయ‌డం ఏంటానీ త్రి స‌భ్య ధ‌ర్మాస‌నం ఈ మేర‌కు అస‌హ‌నం వ్యక్తం చేసింది. అంతేకాదు సీఎం ప‌దవి తోలగించాల‌న్న అభ్య‌ర్థ‌న‌కు విచార‌ణ అర్హ‌త కూడా లేద‌ని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. ఇక సీఎం జ‌గ‌న్ పై యాంటీ క‌ర‌ప్ష‌న్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్ర‌స్ట్ వేసిన పిటిష‌న్ పై కూడా సుప్రీంకోర్టు ద‌ర్మాస‌నం ఘాటుగా స్పందించింది. లేఖ‌లోని అంశంపై ఎంత మంది జోక్యం చేసుకుంటారని ధ‌ర్మాస‌నం ఈ మేర‌కు తెలిపింది.

 అస‌లు యాంటీ క‌ర‌ప్ష‌న్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్ర‌స్ట్  ఎక్క‌డిద‌ని,  యాంటీ క‌ర‌ప్ష‌న్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్ర‌స్ట్ నిధులు ఎక్క‌డి నుంచి వ‌స్తాయని ప్ర‌శ్నించింది. పిటిష‌న్ అభ్య‌ర్థ‌ల‌న్నీ గంద‌ర‌గోళంగా ఉన్నాయ‌ని వ్యాఖ్య‌నించిన ధ‌ర్మాస‌నం, యాంటీ క‌ర‌ప్ష‌న్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్ర‌స్ట్ పిటిషన్ ను కొట్టివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సీఎం జ‌గ‌న్ లేఖ పై దాఖ‌లైన మ‌రో పిటిష‌న్ పై స్పందిస్తూ, లేఖలోని అంశాల‌పై సీబీఐ ద‌ర్యాప్తు జ‌ర‌పాలా? వ‌ద్దా ? అనేది సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ప‌రిధిలోని అంశం అని తెలిపింది. అయిన లేఖ‌లోని అంశాల‌ను ఇప్ప‌టికే వేరే బెంచ్ ప‌రిశీలిస్తుంద‌ని త్రిస‌భ్య ద‌ర్మాస‌నం గుర్తుచేసింది.

 దాంతో లేఖ‌లోని అంశాల‌పై , ఇదివ‌ర‌కే  ఏపీ ప్ర‌భుత్వం వేసీన పిటిష‌న్ కు, తాజా పిటిష‌న్ ను కూడా జ‌త‌చేస్తున్న‌ట్లు   సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం తీర్పును వెల్ల‌డించింది. ఏది ఏమైనా సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ లేఖ‌పై సీఎం జ‌గ‌న్ ను ఇరికించాల‌ని చూసిన‌ ప్ర‌తి వాదుల‌కు సుప్రీంకోర్టు  ద‌ర్మాస‌నం ఇచ్చిన తీర్పు ఓ చెంప‌పెట్టులాంటిదేన‌ని చెప్పుకోవ‌చ్చు. సుప్రీంకోర్టు ధ‌ర్మాసనం  వెల్లువ‌రించిన తాజా తీర్పుతో, ప్ర‌తివాదులు ఇప్పుడు  డిఫెన్స్ లో ప‌డిపోయినట్లుగా తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: