హైదరబాద్, ఉప్పల్ :  గ్రేటర్ ఎన్నికల పోలింగ్ దాదాపుగా పూర్తి కావస్తుంది.అయితే ఈ గ్రేటర్ ఎన్నికలు పలు పార్టీ లకు కీలకంగా మారినందున రిగ్గింగ్ కు పాల్పడుతున్నారు కొందరు పార్టీ కార్యకర్తలు.ఉప్పల్ పరిధిలోని 10 డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కి చెందిన కొందరు ఆధర్ కార్డ్ లపై ఫోటోలు మార్చి పోలింగ్ బూత్ లోకి వచ్చి ఫేక్ గుర్తింపు కార్డ్ లను తయారు చేసి దొంగ ఓట్లు వేస్తున్నారని టి‌ఆర్‌ఎస్ కార్యకర్తలు వారితో ఘర్షణకు దిగారు.

 సూర్య పేట్ కు చెందిన కొంత మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉప్పల్ డివిజన్ కు సంబందించిన వారికి అనుకూలంగా కొంతమంది ఆధర్ ఫోటోలు మార్చి అధికారుల కళ్ళు గప్పి దొంగ ఓట్లు వేస్తున్నారట.అక్కడ ఉన్న కొందరి పై టి‌ఆర్‌ఎస్ కార్య కర్తలకు అనుమానం వచ్చి వారిని నిలదీయ్యగా ఇరు వర్గాలకు మద్య ఘర్షణ చోటుచేసుకుంది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను ఎంక్వైరీ చేయాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఫేక్ గుర్తింపు కార్డులతో దొంగ ఓట్లు వేస్తూ రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని గ్రహించారు.వెంటనే వారిని అదుపులోకి తీసుకుని వారి దగ్గర ఉన్న ఫేక్ గుర్తింపు కార్డులను స్వాదినం చేసుకున్నారు.  .

మరింత సమాచారం తెలుసుకోండి: