భారతీయ జనతా పార్టీలోకి విజయశాంతి వెళ్లడం దాదాపుగా కాయం గా కనబడుతుంది. అయితే ఆమె ఎప్పుడు పార్టీ మారుతుంది ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా ఆమె పార్టీ మారే అంశానికి సంబంధించి త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆమె బిజెపి రాష్ట్ర స్థాయి నేతలతో అదేవిధంగా జాతీయ స్థాయి నేతలతో కూడా చర్చలు జరిపారు అని అంటున్నారు. పలువురు కీలక నేతలతో ఆమె ఇటీవల చర్చలు జరుపుతూ వస్తున్నారు. ఆమె పార్టీలోకి వచ్చే అంశానికి సంబంధించి అందరూ కూడా సుముఖత వ్యక్తం చేశారు.

ఇక ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కూడా ఆమె త్వరలోనే సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇది ఇలా ఉంటే విజయశాంతి ఆ పార్టీలో చేరితే ఆమెకు ఇచ్చే పదవి ఏంటి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఆమెకు జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు పదవి కూడా అప్పగించే అవకాశం ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే తెలంగాణ నుంచి జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ ఉన్న సంగతి తెలిసిందే.

ఆమెకు ఆ పదవి ఇస్తారా లేదా అనేది చూడాలి. ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ఆమెకు మెదక్ ఎంపీ సీటు బిజెపి ఆఫర్ చేసిందని అంటున్నారు. కాబట్టి అక్కడి నుంచి ఆమె పని చేసుకునే అవకాశాలు ఉన్నాయి అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఆమె విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది చూడాలి. ఆమె ఈనెల ఏడో తారీఖున భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక స్పష్టత రానుంది. మరికొంత మంది చేరే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: