కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఇప్పుడు సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేస్తారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే కేంద్ర క్యాబినెట్ నుంచి ఎవరిని తప్పిస్తారు అనే దానిపై ఇపుడు సర్వత్రా కూడా చర్చలు ఉన్నాయి. అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను తప్పించే అవకాశం ఉందని ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ ని ఆ పదవిలో నియమించే అవకాశాలు ఉన్నాయి అని వ్యాఖ్యలు చేస్తున్నారు.

ప్రస్తుతం కేంద్ర మంత్రి పదవుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ప్రధాని నరేంద్ర మోడీ మనసులో ఎవరున్నారు ఏంటి అనేది చూడాలి. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ప్రధానంగా నిర్మల సీతారామన్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే మంత్రి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చాలాఅవసరం. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే వ్యవసాయ రంగంలో కూడా తీవ్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. వ్యవసాయ చట్టాన్ని రైతులకు వివరించే విషయంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఘోరంగా విఫలం అయ్యారు అని ఆరోపణలు ఉన్నాయి. రైతులతో మాట్లాడకపోవడమే కాకుండా రైతులకు అర్థమయ్యే విధంగా సోషల్ మీడియాలో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు చేయలేకపోయింది. దీనికి ప్రధాన కారణం కేంద్ర వ్యవసాయశాఖ అనే ఆరోపణలు ఎక్కువగా. దీనితో ప్రధాని నరేంద్ర మోడీ వ్యవసాయ శాఖ మంత్రి కూడా మార్చే ఆలోచనలో ఉన్నారు అనే చర్చలు జరుగుతున్నాయి. మరి దీనికి సంబంధించి నిర్ణయం ఎలా తీసుకుంటారు ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: