ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విషయంలో సీఎం వైఎస్ జగన్ చాలావరకు సీరియస్ గానే ఉన్న సరే సంక్షేమ కార్యక్రమాలకు ఆదాయ వనరులు భారీగా తగ్గిపోవడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది ఏంటి అనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు సీఎం జగన్ విధిస్తున్న కొన్ని పన్నులు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు దారితీస్తున్నాయి. అసలే ప్రజలు కరోనా దెబ్బకు ఆర్థిక కష్టాల్లో ఉన్న సమయంలో సీఎం జగన్ కొత్త కొత్త పన్నులతో ప్రజలను వేధిస్తున్న పరిస్థితి.

దీని వలన ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుందని పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది అంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని అందించిన సరే ఈ విధంగా వసూలు చేస్తే ఇంకా అందించడం ఎందుకు అని పలువురు నిలదీస్తున్నారు. ముఖ్యంగా వాహన యజమానుల వద్ద వసూలు చేస్తున్న పన్నులు అయితే చాలా వరకు దారుణంగా ఉన్నాయి. జరిమానాల పేరుతో వారి వద్ద నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. దీనివలన రోడ్ల మీదకు రావాలి అంటేనే భయపడుతున్నారు.

ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో కూడా సీఎం జగన్ తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఈ స్థాయిలో పెట్రోల్ ధరలు వసూలు చేస్తే తాము వ్యాపారాలు ఎలా చేసుకోవాలి అని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు చేసేవారిలో కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర రహదారుల మీద 35 నుంచి 40 కిలోమీటర్ల వరకు టోల్ గేట్లు పెట్టాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఏ రాష్ట్రంలో కూడా లేని విధానాలను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్నారు. మరి దీనిపై కేబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. దీనిపై విపక్షాలు కూడా మండిపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: