గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇప్పుడు అక్కడి ప్రజలు ముఖ్యంగా యువత పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి . యువత ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో వెనకడుగు వేయడంతో తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రజలు ముందుకు వచ్చి ఓటు వేస్తే చైతన్యం అనేది ఉంటుంది. అయినా సరే ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో చాలామంది ముందుకు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. అయితే హైదరాబాద్ యువత తీరుపై ఇప్పుడు జాతీయ స్థాయిలో సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

ఎందుకు ఓటు వేయడం లేదని హైదరాబాద్ నగరం కీలకం అని అలాగే అక్కడ ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వారికి ఓటు హక్కు అనేది చాలా కీలకమని ఆయన సరే ఎందుకు ముందుకు రావడం లేదంటూ జాతీయ మీడియా కూడా ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక జాతీయ మీడియాలో అయితే సోషల్ మీడియాలో మాట్లాడే ధైర్యం ఉన్న మీకు ఓటు వేసే ధైర్యం లేదా అని నిలదీసింది. వరదల సమయంలో కొంతమంది హడావుడి చేశారని కానీ ఇప్పుడు హడావుడంతా ఏమైంది అని నిలదీస్తున్నారు.

ఏదైనా సరే ప్రజల ప్రాణాల మీదకు వస్తే మాత్రమే ముందుకు వస్తారని లేకపోతే ముందుకు వచ్చే సమస్య ఉండదు అంటూ కొంతమంది మండిపడుతున్నారు. హైదరాబాద్ పరువు ఇప్పుడు జాతీయ స్థాయిలో పోయింది,. ఎంతో చైతన్యం ఉన్న నగరంగా చెప్పుకునే హైదరాబాదులో ఓటు వేయకపోవడం ఏంటి అని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం ఐదు గంటలు దాటినా ఇప్పటి వరకు 30 శాతం కూడా పోలింగ్ నమోదు కాలేదు. గత ఎన్నికల్లో 46 శాతం వరకు పోలింగ్ నమోదయింది. కానీ ఈ సారి 30 శాతం కూడా నమోదు అవుతుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. చూడాలి మరి...

మరింత సమాచారం తెలుసుకోండి: