జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల కోడ్ వచ్చినప్పటినుండి రాజకీయ పార్టీలు ఏ రేంజ్ లో కోలాహలం చేశాయే తెలిసిందే.స్థానిక ఎన్నికలే అయినప్పటికి సార్వత్రిక ఎన్నికలను తలపించేలా ప్రచారాలను హోరెత్తించాయి. ప్రధాన పార్టీలన్ని ఢీ అంటూ ఢీ అన్నట్లు ప్రచారాన్ని కొనసాగించాయి. ఈ ఎన్నికల్లో మాత్రం బి‌జే‌పి హాట్ టాపిక్ గా మారింది ఏకంగా అమిత్ షా తో సహ బి‌జే‌పి కీలక నేతలందరితోనూ ప్రచారం చేయించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.

పోలింగ్ కోసం కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూసిన పార్టీలు నేడు పోలింగ్‌ చూస్తే.. రాజకీయ పార్టీలకు షాక్ కలగక మానదు. మధ్యాహ్నం మూడు గంటల వరకు కేవలం 25 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదు కావడం అందరినీ ఆశ్చర్య పరిచింది . మొత్తం మీద 50 శాతం పోలింగ్ అయినా నమోదవుతుందా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి..

 చాలా చోట్ల పోలింగ్ కేంద్రాలలో బూత్‌ ఏజెంట్లు, పోలీసులు తప్ప ఓటర్లు కనిపించడం లేదు.పోలింగ్ మొదలైనప్పటి నుండి చాలా చోట్ల పోలింగ్ మందకొడిగానే సాగుతుంది.మద్యాహ్నం ఓటింగ్ శాతం కాస్త మెరుగ్గా కనిపించిన సాయంత్రం అవుతున్నకొద్ది ఓటర్లు పోలింగ్ బూత్ ల వద్ద తగ్గుతుండడంతో సాయంత్రానికి అత్యల్ప ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: