ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ధీటుగానే మండలి సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఒకప్పుడు అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధం చూడాలంటే అసెంబ్లీకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు మండలిలో సైతం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.

అసెంబ్లీలో వైసీపీకి ఎక్కువమంది సభ్యులు ఉన్నారు కాబట్టి, అక్కడ టీడీపీకి పెద్ద సీన్ ఉండటం లేదు. కానీ మండలిలో టీడీపీకి ఎక్కువ బలం ఉండటంతో అధికార పార్టీకి ధీటుగా ఉంటున్నారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ తన మాటలకు పదును పెంచారు. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ప్రత్యర్ధి పార్టీకి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్‌లతో చినబాబు గట్టిగానే పోరాడారు.

మండలిలో వ్యవసాయంపై చర్చ సందర్భంగా...బొత్స మాట్లాడుతూ...గతంలో చంద్రబాబు వ్యవసాయం దండగ అని మాట్లాడారు అనే విషయం గురించి లేవనెత్తారు. ఇక దీనికి కౌంటర్‌గా చినబాబు మాట్లాడుతూ...చంద్రబాబు ఎక్కడ, ఎప్పుడు అన్నారో చెప్పాలని బొత్సకు సవాల్ విసిరారు. ఇక దీనిపై మంత్రులు...పలురకాలుగా మాట్లాడారు. మనసులో మాట అనే పుస్తకంలో చెప్పారని, అది తమకు దొరకలేదని చెప్పారు.

ఇక దీనికి కూడా చినబాబు కౌంటర్లు ఇచ్చి, అక్కడ ఉంది ఇక్కడ ఉంది, జగన్ చెవిలో చెప్పారు అనకుండా సరైన ఆధారం చూపించాలని మాట్లాడారు. అలాగే చినబాబు బొత్స సత్యనారాయణ, కన్నబాబులని టార్గెట్ చేసి, గతంలో జరిగిన విషయాలని తవ్వి తీసే ప్రయత్నం చేశారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు బొత్స, కన్నబాబులు ఏ విధంగా జగన్‌పై విమర్శలు చేశారో అందరికీ తెలుసని, దానికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, అలాగే చంద్రబాబు వ్యవసాయం దండగ అనే మాట ఎక్కడ అన్నారో చెప్పాలని ఆధారాలు చెప్పాలని, మండలిలో చినబాబు గట్టిగానే వాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: