ఏపీలో అధికార వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకులకు ఎలాంటి కొదవ లేదు. తమ పార్టీకి అండగా ఉంటూ, ప్రత్యర్ధి పార్టీపై విరుచుకుపడే నేతలు ఎక్కువగానే ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ చేసే విమర్శలకు వైసీపీ నుంచి ఫుల్ కౌంటర్లు ఇచ్చే నాయకులు ఉన్నారు. అలాగే చంద్రబాబు అంటే ఒంటికాలి మీద వెళ్ళే నాయకుడు మంత్రి కొడాలి నాని. వైసీపీలో సూపర్ ఫైర్ బ్రాండ్ నాయకుడు అంటే కొడాలి నానినే.

రెండుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాని...ఆ తర్వాత చంద్రబాబుతో విభేదించి టీడీపీ నుంచి బయటకొచ్చి వైసీపీలో చేరారు. ఇక వైసీపీలో చేరిన దగ్గర నుంచి కొడాలి నాని, చంద్రబాబు టార్గెట్‌గా ఎలాంటి విమర్శలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే. అందరికంటే ఎక్కువగానే కొడాలి కాస్త పరుష పదజాలం వాడుతూ, బాబుపై విరుచుకుపడతారు. ఇక ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ, అధికార పక్షానికి అండగా ఉంటున్నారు. ప్రతిపక్ష టీడీపీ ఎలాంటి విమర్శలు చేసిన, వెంటనే కౌంటర్లు ఇచ్చేస్తారు.

మామూలుగా అందరు నాయకులు ప్రత్యర్ధుల విమర్శలకు కౌంటర్లు ఇస్తారు. కానీ కొడాలి నాని రూట్ వేరు, ఓ రేంజ్‌లో చంద్రబాబు అండ్ బ్యాచ్‌పై విమర్శలు చేస్తారు. ఒకోసారి పరుషపదజాలం వాడుతూ నాని విమర్శలు చేస్తుంటారు. తాజాగా కూడా అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ప్రవర్తన అందరినీ షాక్‌కు గురిచేసిన విషయం తెలిసిందే. ఇక దీనిపై కూడా నాని స్పందిస్తూ, బాబుకు లెఫ్ట్, రైట్ ఇచ్చేశారు. అయితే నాని ఇలా మాట్లాడటానికి కారణాలు లేకపోలేదు.

టీడీపీ నేతల చేసే అబద్దాల ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే ఇలా ఘాటుగా మాట్లాడాల్సిందే. లేదంటే టీడీపీ నేతలు ఇంకా జగన్‌ని నెగిటివ్ చేసే ప్రయత్నం చేస్తారు. అందుకే నాని అలా మాట్లాడుతుంటారు. ఇక ఇలా మాట్లాడటం వల్లే, టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేకంగా కొడాలిని టార్గెట్ చేసి విమర్శలు చేస్తారు. ఆయనపై బూతుల మంత్రి అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు. జనాల దగ్గర నెగిటివ్ చేయాలని చూస్తారు. కానీ టీడీపీ నేతల చేసే ప్రయత్నాలు ఎక్కడ వర్కౌట్ కావు. ఆయన్ని ఎంత నెగిటివ్ చేయాలని ఫిక్స్ అయినా, అవి పెద్దగా ఉపయోగం ఉండదు. జనం మద్ధతు ఉన్న నానీని నెగిటివ్ చేయడం చాలా కష్టమే అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: