నేడు గ్రేటర్ పోలింగ్ అంకం ముగిసింది.. రేపు రీపోలింగ్ నిర్వహించనున్నారు.. ఎల్లుండి ఫలితాలు. ఇలా చకచకా గ్రేటర్ ఫలితం మూడు రోజుల్లో తేలనుంది. అయితే ఈ ఈసారి కూడా పోలింగ్ పర్సెంట్ అంత ఆశాజనకంగా లేవనేది రిపోర్టులు చెప్తున్నాయి..ఎంత మొత్తుకున్నా ఇక్కడ ఓట్లు వేయడానికి ఓటర్లు కొంత బద్ధకాన్ని ప్రదర్శిస్తున్నారు..ఇప్పుడే కాదు గత కొన్ని ఎన్నికలనుంచి హైదరాబాద్ వాసులకు ఓటు వేయడం పెద్ద టాస్క్ లా కనిపిస్తుంది.

 2016లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో 45 శాతం పోలింగ్‌ నమోదైంది. లోక్‌సభ, అసెంబ్లీ ఇలా ఏ ఎన్నికల్లోనైనా హైదరాబాద్‌లో పోలింగ్‌ శాతం 50 శాతానికి అటు ఇటుగా ఉంటోంది. దీన్ని బట్టి ఈ ఎన్నికలు వారికి ఎంత చీప్ గా కనిపిస్తాయో అర్థం చేసుకోవచ్చు.. ప్రతి ఎన్నికల సమయంలోనూ, పోలింగ్‌ ముందు ఓటు వేయాలంటూ ప్రముఖులు చేస్తున్న విజ్ఞప్తులను హైదరాబాద్‌ ఓటర్లు పెద్దగా పట్టించుకోవడంలేదు. ఈ సారి ఎన్నికలు గతానికి భిన్నంగా సాగాయి. మేయర్‌ పీఠం కోసం కొత్త ప్రతర్థిగా బీజేపీ బరిలో నిలిచింది. టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. మతం, అభివృద్ధి, వరదలు, శాంతిభద్రతలు.. ఎన్నికల ప్రచారంలో ప్రధానాంశాలయ్యాయి. అయినా ప్రజల తీరు మాత్రం ఏమాత్రం రాలేదు..

టీవీలకే పరిమితమైపోయి బయట జరిగే చోద్యం చూశారు తప్పా ఓటువేసి వారి సంఖ్యా తగ్గుతూవస్తుందే తప్పా పెరగడం లేదు. ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల పోలింగ్‌ అత్యంత మందకొడిగా మొదలైంది.. బ్యాలెట్‌పేపర్‌లో సీపీఐ, సీపీఎం గుర్తులు తారుమారు కావడంతో ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌ (26)లో పోలింగ్‌ ఈ నెల 3కు వాయిదా వేశారు. మిగతా 149 డివిజన్లలో పోలింగ్‌ జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటకు గ్రేటర్‌లో సరాసరి 18.2 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. మొత్తం పోలింగ్ పూర్తయ్యే సరికి ఎంత పర్శంట్జ్ పోల్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: