తెలంగాణాలో ఏ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఇంత ఆసక్తి కరంగా సాగలేదు.. ఎప్పుడు అధికార పార్టీ తెరాస దే హవా కొనసాగేది. కానీ దుబ్బాక ఉప ఎన్నిక నుంచి మాత్రం కేసీఆర్ జోరు తగ్గిందని చెప్పాలి.. సెంట్రల్ లో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఓ విప్లవం లాంటి గెలుపును అందిపుచ్చుకుంది చెప్పొచ్చు.. ఎందుకంటే ఎలాంటి బలం లేనివేళ ఇక్కడ తెరాస పార్టీ దూసుకుపోయిన వేళా బీజేపీ పార్టీ గెలవడం అంటే మాములు విషయం కాదు. గెలుస్తూనే తమ వాయిస్ కూడా పెంచారు బ్జ్ప్ నేతలు..
 
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల ప్రచారం సాగించాయి. కాంగ్రెస్ అయితే పెద్దగా కనిపించినప్పటికీ వీరిద్దరికి పోరు అన్నట్లుగా ఎన్నికల ప్రచార పర్వం సాగింది.  ఆరోపణలు, విమర్శలతో హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షించాయి అంటే ఎరేంజ్ లో ఈ ప్రచారం సాగిందో అర్థం చేసుకోవచ్చు.. బీజేపీ తరఫున అమిత్‌ షా, యూపీ సీఎం యోగి, మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవిస్‌ వంటి అతిరథ మహారధులు ప్రచారం సాగించారు. టీఆర్‌ఎస్‌ తరఫున సీఎం కేసీఆర్‌ సభ నిర్వహించగా.. ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్‌ కాలికి బలపం కట్టుకుని హైదరాబాద్‌ అంతా తిరిగాడు.

ఇక ఈరోజు జరిగిన పోలింగ్ లో ఏ పార్టీ గెలుస్తుందో ఒక అంచనాకి రాలేకపోతున్నారని వార్తలు వస్తున్నాయి..  గ్రేటర్‌ వ్యాప్తంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణలు మధ్యనే వివాదాలు, తోపులాటలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రలోభపెడుతున్నారని, డబ్బులు పంచుతున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలతో బీజేపీ కార్యకర్తలు తలపడుతున్నారు. గ్రేటర్‌లో కీలక పార్టీ అయిన ఎంఐఎం.. పాత బస్తీకే పరిమితం అయింది. బీజేపీ, ఎంఐఎం పార్టీ కార్యకర్తల మధ్య ఎలాంటి వివాదాలు చోటుచేసుకోవడంలేదు. ప్రధానంగా టీఆర్‌ఎస్, బీజేపీల మధ్యనే గ్రేటర్‌ పోరు సాగుతున్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: