గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నగరంలో ని ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఓట్లు వేసి తమకు ఉన్న హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ నిర్వీరంగా సాయంత్రం వరకు జరిగింది. ప్రతి ఒక్కరికీ కల్పించిన ఓటు హక్కు వినియోగించుకోవడంలో హైదరాబాద్ వాసులు ఎక్కడా తడబడలేదు.. అయితే ప్రజలు ఎవరికీ ఓటువేశారు. ఏ పార్టీ గెలవబోతుందనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.. ప్రచారంలో అయితే అన్ని పార్టీ లు తమదే గెలుపు అంటూ ప్రచారం చేసుకున్నాయి.. బీజేపీ పార్టీ అయితే ఆల్మోస్ట్ గెలిచేసిన సంబరాలు ప్రచారంలోనే కనిపించాయి.

టీ ఆర్ ఎస్ కి ఇక్కడ కొంత బ్యాడ్ నేమ్ అయితే ఉందని చెప్పాలి.. ఎలక్షన్స్ అనుకున్న సమయానికి హైదరాబాద్ లో వర్షాలు రావడం అధికార పార్టీ కి కొంత తలనొప్పిగా మారింది.. వరద సాయం అంటూ ప్రకటించినా ఆ సాయం అందించడంలో జాప్యం, లోపాలు చాలా కనిపించాయి.. వరద సాయం అందించక చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు.. దీంతో సహజంగా టీ ఆర్ ఎస్ పైన వ్యతిరేకత వచ్చింది.. అయితే గ్రేటర్ లో ఇది తప్పా టీ ఆర్ ఎస్ పార్టీ ఏదీ పెద్ద గా మైనస్ కాలేదు. దాంతో టీ ఆర్ ఎస్ కూడా ఇక్కడ గెలవడం ఖాయంగా ముందునుంచి చెప్పుకుంది..

అయితే ఈరోజు పోలింగ్ మొగిసిన నేపథ్యంలో ఏ పార్టీ ఇక్కడ గెలుస్తుందో అని ఆసక్తి కరంగా మారింది. ముందునుంచి పాలిస్తున్న తెరాస గెలుస్తుందా లేదా అండర్ డాగ్స్ గా ఉన్న బీజేపీ గెలుస్తుందా అన్నది ఇపుడు ఆసక్తి కరంగా ఉంది.. అయితే ఏది గెలిచినా సంచలనం అవుతుందని అంటున్నారు విశ్లేషకులు.. బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో ఓ కొత్త పార్టీ తెరాస కి పోటీ గా రాబోతుంది.. ఒకవేళ తెరాస గెలిస్తే కేసీఆర్ కూడా కొంత జాగ్రత్తగా మెలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక పోలింగ్ కూడా అంతంతమాత్రంగా పోవడం తెరాస కి కలిసొచ్చే అంశం..

మరింత సమాచారం తెలుసుకోండి: