గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ తక్కువ నమోదు కావడానికి సి‌ఎం మరియు ఈసీ నే కారణమని వ్యాఖ్యానించారు బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.సి‌ఎం పార్టీ గ్రేటర్ లో కూలిపోవడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని అన్నారు.బండి సంజయ్ కారు పై నిన్న దాడి జరగడంతో దీనికి నిరసనగా బి‌జే‌పి కీలక నేతలు బీజేపీ కార్యాలయంలో ఉదయం నుండి ద్క్ష చెప్పట్టారు.

 దీక్షా చేపట్టిన వారికి నిమ్మరసం ఇచ్చి కిషన్ రెడ్డి, సంజయ్ లు దీక్ష విరమింప చేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ పోలీసులు ,ఈసీని సి‌ఎం చెప్పుచేతల్లో పెట్టుకున్నారని అన్నారు. ఈ ఎన్నికలో దౌర్జన్యానికి పాల్పడ్డారన్న ఆయన దానికి నిరసనగా బీజేపీ నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, వివేక్ లు దీక్షకు దిగారని అన్నారు.

 పోలింగ్ పర్సెంటేజ్ తగ్గడానికి సీఎం, పోలీసులు, ఈసీ నే కారణమని ఆరోపించారు. ఓటింగ్ పెంచాల్సిన వాళ్లే ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి ఓటింగ్ శాతం తగ్గించరాని అన్నారు.గ్రేటర్ లో సీఎం సి‌ఎం ఓటమికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని వ్యాఖ్యానించారు.  మేయర్ పదవి బీజేపీ కైవసం చేసుకోబోతుందని, ఓటింగ్ లో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: