గ్రేటర్ ఎన్నికల పోరు ముగిసింది. నియోజక వర్గాల్లో పోలింగ్ అత్యంత పేలవంగా సాగింది. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కనిపించిన హోరు.. పోలింగ్ సమయంలో కనిపించ లేదు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమై ఓటు హక్కు వినియోగించు కోవడంపై దృష్టి పెట్టలేదు. ఈ సారి బల్దియా ఎన్నికలు ఎన్నడూ లేనంత మందకొడిగా సాగాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్లలో ఓటింగ్ అత్యల్పంగా నమోదవడం గమనార్హం.

గ్రేటర్ ఎన్నికల్లో ఇలా పోలింగ్ పడిపోవడం పట్ల రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రజాస్వామ్య వ్యవస్థే దెబ్బతింటుందని వాళ్లు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ ఎన్నికల్లో ఇంతలా పోలింగ్ తగ్గిపోవడానికి కారణాలేంటా? అనే ప్రశ్న తలెత్తింది. దీనికి విశ్లేషకులు 15 అంశాలను కారణాలుగా చూపుతున్నారు.

వీటిలో ప్రజలు చేసిన తప్పిదాలతో పాటు, ప్రభుత్వం అలాగే ఎన్నికల సంఘం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను కూడా విశ్లేషకులు ఎత్తి చూపారు. ఈ కారణాలను మనం కూడా ఓసారి పరిశీలిద్దాం.

గ్రేటర్ ఎన్నికల్లో మందకొడి పోలింగ్ కారణాలు:
1. ప్రజల్లో బద్దకం
2. ఎన్నికల పట్ల నిర్లక్ష్యం
3. ఓటు వేయాలనే కనీస బాధ్యత లేకపోవడం
4. దేశభక్తి లేకపోవడం
5. రాజ్యాంగం మీద గౌరవం లేకపోవడం
6. నగరం మీద ఇంట్రస్ట్ లేకపోవడం
7. భవిష్యత్ మీద విజన్ లేకపోవడం
8. వరుస సెలవులతో ప్రజలంతా ఎంజాయ్ చేసే మూడ్‌లో ఉండటం
9. ప్రభుత్వం, ఎన్నికల సంఘాల వైఫల్యం
10. వ్యూహాత్మకంగా ప్రభుత్వమే పోలింగ్‌ను నిర్వీర్యం చేయడం
11. వరుస సెలవుల వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం
12. ఓటింగ్ పెంచాలనే చిత్తశుద్ధి పార్టీలకు లేకపోవడం
13. ఐటీ సంస్థలు సెలవు ఇవ్వకపోవడం
14. కొందరిలో కరోనా పట్ల భయం ఎక్కువగా ఉండటం
15. ఓటు వినియోగం పట్ల భయం లేకపోవడం

ఈ 15 కారణాల వల్లే ఎన్నికల్లో పోలింగ్ చాలా తక్కువగా నమోదయిందని, ప్రజలు, పార్టీలు, ప్రభుత్వం, ఎన్నికల సంఘం సమిష్టి వైఫల్యం కారణంగానే ఎన్నికలు ఇంత పేలవంగా ముగిశాయని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: