ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండిగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు ప్రజలు ఎక్కువుగా ఆసక్తి చూపించలేదు,
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు అసెంబ్లీ ఎలక్షన్స్ స్థాయిలో హోరాహోరీగా ప్రచారం జరిపాయి పార్టీలు. అదేవిధంగా టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు తమ వల్ల కలిగే ప్రయోజనాలు గురించి చెప్పుకొని ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేసారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య అయితే ఆరోపణలు  కూడా జరిగాయి. ఇంతలా ప్రచారం చేసినా ప్రజల్లో చైతన్యం అయితే మాత్రం పెద్దగా రాలేదని భావించవచ్చు,ఎందుకంటే మంగళవారం జరిగిన పోలింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి నగర వాసులు పెద్దగా ఆసక్తి చూపలేదు.అందుకని  జనాల్లో చైతన్యం తీసుకు రావాలి అని కొంతమంది సెలబ్రిటీలు  ముందుకు  వచ్చారు. ఇలా సూచించిన వారిలో టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఉన్నారు.



హైదరాబాదులో ఓటు హక్కు ఉండీ.. ఓటు వేయకుండా ఇంట్లో కూర్చున్న అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా అంటూ అందరిలో చైతన్యం పెంచడానికి  పూనుకున్నాడు. ఓటు వేయండి. వేయకుంటే మీరు అడిగే హక్కును కోల్పోతారు. అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. బండ్ల ట్వీట్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ‘‘ఇంత సాఫ్ట్‌గా చెబితే జనాలు మాట వినరు అన్న’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ  ఎన్నికల్లో ఎప్పుడూ పోలింగ్ మందకొడిగానే ఉంటుంది. 30 నుంచి 40 శాతం మధ్యే గతంలో ఓటింగ్ జరిగింది. కానీ, ఈసారి గతం కన్నా తక్కువ శాతం అయ్యేలా కనిపిస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంటకి 20 శాతం ఓటింగ్ కూడా నమోదు కాకపోవడం గమనార్హం. సాయంత్రానికి ఇంచుమించుగా 35.80 శాతం ఓటింగ్ నమోదు కాక పోవడం గమనార్హం...ఇలాంటి మరెన్నో వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. మరెన్నో విషయాలు తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: