ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తం గా నే ఉన్నాయి అనే విషయం తెలిసిందే.  దాదాపు నెలలు గడుస్తున్నప్పటికీ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. విదేశాలకు చెందిన సైన్యం ఎక్కడా వెనక్కి తగ్గకుండా ప్రస్తుతం సరిహద్దుల్లో గడ్డకట్టుకుపోయే చలిలో కూడా పహారా కాస్తున్నారు. సాధారణంగా అయితే ప్రస్తుతం శీతాకాలం సమయంలో గడ్డకట్టుకుపోయే చలిలో కేవలం పది వేల మంది సైనికులు మాత్రమే అక్కడ పహారా కాస్తూ ఉండేవారు కానీ ప్రస్తుతం భారత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా.. దాదాపు 50 నుంచి 70 వేల మంది  సైనికులు ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో పహారా కాస్తున్నారు.



 అయితే భారత్ చైనా సరిహద్దు తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులను ఎలా అయితే ప్రస్తుతం భారత్ అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటుందో..  సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను సైన్యం ట్రైనింగ్ కోసం కూడా ప్రస్తుతం భారత్  ఉపయోగించుకుంటున్నది.  ఇలా చైనా తో తలెత్తిన వివాదం కాస్త భారత సైనికుల ట్రైనింగ్ కూడా ఎంతగానో పనికొస్తుంది అని చెప్పాలి. సాధారణంగా అయితే పదివేల మంది మాత్రమే సరిహద్దుల్లో లడక్ ప్రాంతంలో పహారా కాసే వారు.  కానీ ప్రస్తుతం దాదాపు  70వేల మంది సైనికులు అక్కడి వాతావరణానికి అలవాటు చేసుకుని పహారా కాస్తున్నారు.



 అంతేకాకుండా ప్రస్తుతం భారత ఆర్మీ లోని మార్కోస్ , గరుడ, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్, వీరితో పాటు పారాచ్యూట్  కమాండర్ దళాలు కూడా అక్కడ మోహరించి ఉన్నాయి అన్నది అర్ధమవుతుంది. ఇలా గడ్డకట్టుకుపోయే చలిలో భారత దేశ ఆర్మీ కి సంబంధించిన అన్ని విభాగాలను  కూడా మొహరించి ఉన్నాయి అన్నది అర్ధమవుతుంది. అక్కడ ఉన్నటువంటి మంచులో  గడ్డకట్టుకుపోయే చలిలో ఈ దళాలు మొత్తం అలవాటు పడిపోయి ట్రైనింగ్ తీసుకోవాలనే ఉద్దేశంతో... ప్రస్తుతం అన్ని విభాగాలను భారత ఆర్మీ అక్కడ మొహరిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: