హోరా హోరీగా సాగుతుందని అందరూ అనుకున్న గ్రేటర్ ఎన్నికల పోలింగ్ చాలా చప్పగా సాగింది. అత్యల్పంగా ఓటింగ్ జరిగడంతో చాలామంది నేతలు, పార్టీలు ఈ ఎన్నికల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే ఎన్నికల మాత్రం ప్రశాంతంగానే జరిగాయని, అక్కడక్కడా చెదురు మదరు ఘటనలే జరిగాయి. ఈ క్రమంలో ముషీరాబాద్ నియోజక వర్గంలోని ఆడిక్‌మెట్‌ డివిజన్‌లో వివాదం చెలరేగింది. టీఆర్ఎస్- కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది.  దీంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితలు నెలకొన్నాయి. ఈ డివిజన్‌లో మహబూబ్‌ నగర్‌కు చెందిన‌ టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారని, బయటి ప్రాంతాల వారు ఇక్కడకు రాకూడదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకకు ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు ఉన్నాయన్న విషయాన్ని వారు గుర్తు చేశారు.

మహబూబ్ నగర్‌కు చెందిన నేతలు వెళ్లిపోవాలని, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు అమలు చేయాలని అన్నారు. ఈ ఆదేశాలు ఇక్కడ అమలు కావడం లేదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్ ఆరోపించారు. అధికార పార్టీ నేతలు ఇలా ఆదేశాలు ఉల్లంఘిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని, వారిపై ఎన్నికల సంఘం, పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటర్లను ప్రభావితం చేయడానికి టీఆర్ఎస్ నేతలు నానా ప్రయత్నాలూ చేస్తున్నారని ఆరోపించారు. కాగా, ఈ ఎన్నికల్లో అత్యల్పంగా పోలింగ్ నమోదవడం పట్ల విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే గ్రేటర్‌ ఎన్నికల్లో కేవలం మలక్ పేట నియోజక వర్గంలో మాత్రమే పోలింగ్ రద్దయింది. ఇక్కడ పార్టీల గుర్తులు మారిపోవడంతో ఎన్నికలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇక్కడ డిసెంబరు 3న పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఇంతకు మించి నగరంలో భారీగా ఘర్షణలు ఎక్కడా జరగలేదని, ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే పోలింగ్ శాతం తగ్గడం మాత్రం ఆందోళనకరమే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: