వరుసగా నాలుగు రోజులు సెలవులు ఇచ్చి ప్రజలు ఓటింగ్ కు రాకుండా చేసి ఓటింగ్ శాతం తగ్గించడంలో సి‌ఎం కే‌సి‌ఆర్ విజయం విజయం సాధించడాని తెలంగాణ రాష్ట్ర బి‌జే‌పి అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.ఆయన హైదరాబాద్‌లోని బి‌జే‌పి కేంద్ర కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డితో కలిసి నిర్వహించిన‌ మీడియాతో మాట్లాడారు.

ఆయన మాట్లాడుతూ ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలను దేశం మొత్తం ఆసక్తితో చూస్తోందని అన్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు వ్యవస్థ ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చేలా వ్యవహరించిందని మండిపడ్డారు..ఈ రెండు వ్యవస్థలు కే‌సి‌ఆర్ కు తొత్తుల్ల మారిపోయాయని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.ఓటింగ్ శాతం తగ్గించేందుకు చేసిన కుట్రలో  తెరాస విజయం సాధించిందని వ్యాఖ్యానించారు.

స్వయంగా పోలీసులే నగదు పంపిణీ చేస్తుండడం సిగ్గు చేటు అన్నారు. ఎన్నికల సంఘం పూర్తిగా సీఎం డైరెక్షన్‌లోనే నడుస్తోందని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్‌కు సీపీఎం, సీపీఐ గుర్తులు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని రద్దు చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.గ్రేటర్ ఎన్నికల్లో బి‌జే‌పి ఘనవిజయం సాదించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: