గ్రేటర్ లో పోలింగ్ ముగిసింది. గ్రేటర్‌ ఎన్నికల్లో మలక్‌పేట సర్కిల్‌ పరిధిలోని డివిజన్లలోని వివిధ పార్టీలకు చెందిన  ముఖ్య నేతలు, పార్టీల అభ్యర్ధులు మంగళవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయమే కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశారు. మూసారంబాగ్‌ డివిజన్‌ సలీంనగర్‌లోని సెయింట్‌ మేరీలో హైస్కూల్లో  బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి ఓటు వేశారు.

మూసారంబాగ్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ అభ్యర్థి తీగల సునరితఅజీత్‌రెడ్డి దంపతులు స్వామివివేకానంద స్కూల్లో ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చేకోలేకర్‌ సదాలక్ష్మీ, మాజీ కార్పొరేటర్‌ చేకోలేకర్‌ శ్రీనివాస్‌ సెయింట్‌ డామ్నిక్స్‌స్కూలో ఓటు వేశారు. గడ్డిఅన్నారంలో యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి సంఘిరెడ్డి ఓటు వేయగా.. టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షురాలు అనితానాయక్‌ మూసారంబాగ్‌ ఓటేశారు.

ఆర్‌కేపురం డివిజన్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు మంగళవారం ప్రశాంతగా ముగిషాయి. ఉదయం 9 గంటలల వరకు పోలింగ్‌ కేంద్రాల వరకు ఓటర్లు ఎవ్వరు రాకపోవడంతో పార్టీల అభ్యర్ధులు కొంత ఆందోళనకు గురుయ్యారు. ప్రజలు ఓటు వినయోగంచుకోవడంతో ఉత్సహాం చూపకపోవడంతో పోలింగ్‌ బూత్‌లు ఖాళీగా కనిపించాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రతి తక్కువ శాతం ఓటింగ్‌ నమోదవుతుంది. కాలనీల్లో నుంచి ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చేపలేదు. ఎక్కవ శాతం బస్తీవాల్లే ఓటింగ్‌ పాల్గొన్నారు.
 
ముఖ్యమంత్రి పథకాలే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో విజయం సాధిస్తుందని రాష్ట్ర హోంమంత్రి మహిమూద్‌ అలీ అన్నారు. మంగళవారం ఆజంపురలోని క్రిడ్జ్‌ పాఠశాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రేటర్‌లో అధికారం టీఆర్‌ఎస్‌ పార్టీదేనన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా హైద్రాబాద్‌ అభివృద్ధి జరిగిందన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కడతారన్నారు. సమావేశంలో మలక్‌పేట ఇన్‌చార్జి ఆజమ్‌ఆలీ, ప్రధాన కార్యదర్శి లాయక్‌ఆలీ తదితరులు పాల్గొన్నారు.

మలక్‌పేట నియోజకవర్గం ఓల్డ్‌మలక్‌పేట డివిజన్‌లో 26 వార్డులో ఎన్నికలు రద్దు చేస్తున్నట్లు రిటర్నింగ్‌ అధికారి సంధ్యరాణి తెలిపారు. మంగళవారం డివిజన్‌లో మాట్లాడుతూ బ్యాలెట్‌ పేపర్‌లో సీపీఐ పార్టీ అభ్యర్థి గుర్తు కంకికొడవలి కాగా.. దానికి బదులు సీపీఎం సుత్తె కొడవలి గుర్తు రావడంతో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మన్నన్‌ రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయడంతో ఎన్నికల అధికారి పై అధికారులకు తెలియజేయగా ఎన్నికను రద్దు చేసినట్లు ఆమె తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: