ఏపీ సిఎం వైఎస్ జగన్ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ ఈ మధ్య సంచలనం అయింది. ఈ లేఖ విషయంలో న్యాయ రాజకీయ దుమారం పెద్ద ఎత్తున చెలరేగింది. ఈ లేఖ విషయంలో సుప్రీం కోర్ట్ న్యాయ వాదులు కూడా సీరియస్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే సీఎం జగన్‍కు వ్యతిరేకంగా దాఖలైన 3 పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. జడ్జిలపై ఆరోపణలతో లేఖ రాయడం, బహిర్గతం చేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు అయిన సంగతి తెలిసిందే. జస్టిస్ సంజయ్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ రిషికేశ్ రాయ్ ధర్మాసనం విచారణ జరపగా...

లేఖ బహిర్గతంపై దురుద్దేశం ఉన్నందున చర్యలు తీసుకోవాలని పిటిషినర్ మణి సుప్రీం కోర్ట్ ని కోరారు. జగన్‍ లేఖపై కాలపరిమితిలో అంతర్గత విచారణ చేయాలని జీఎస్ మణి కోరగా... లేఖ రాసి బహిర్గతం చేశాక విచారణ జరపాల్సిన అవసరమేంటని జస్టిస్ కౌల్ నిలదీశారు. అమరావతి భూములపై ఇప్పటికే గ్యాగ్ ఆర్డ ర్‍ను సుప్రీంకోర్టు ఎత్తివేసిందని జస్టిస్ కౌల్ వివరించారు. సుప్రీం జడ్జిపై సీఎం జగన్ వ్యాఖ్యల పిటిషన్‍ ను మరో పిటిషన్‍ తో జత చేస్తామని జస్టిస్ కౌల్ వివరించారు. దమ్మాలపాటికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‍తో దీన్ని జత చేసింది అని ఆయన తెలిపారు. జనవరి చివరి వారంలో విచారణకు ఏపీ ప్రభుత్వ పిటిషన్ పేర్కొంది.

 సీఎం జగన్ చర్యలు స్వతంత్ర న్యాయవ్యవస్థకు ముప్పు అని కోర్టుకు మణి  తెలిపారు. అయితే... పిటిషనర్ అభ్యర్థనలు గందరగోళంగా ఉన్నాయని జస్టిస్ కౌల్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. సీఎం లేఖపై విచారణ, చర్యల పిటిషన్లు గందరగోళంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. రెండో అభ్యర్థన న్యాయపరంగా చెల్లదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా  స్పష్టం చేసింది. జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ పిటిషన్ కూడా సుప్రీం కొట్టేసింది. జగన్ ఆరోపణల అంశాలు ఇప్పటికే వేరే ధర్మాసనంలో ఉన్నాయని జస్టిస్ కౌల్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: